Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Term Insurance Plan: కోటి రూపాయల ఇన్సూరెన్స్ ప్లాన్‌ అవసరమా? కవరేజ్‌ను ఎలా నిర్ణయిస్తారు?

అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ టర్మ్ ప్లాన్ కవర్‌ను రూ. 1 కోటి మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. పెద్ద సెలబ్రిటీల ప్రోమోలు.. వారి పంచ్ లైన్‌లు మీరు రూ. 1 కోటి ఇన్సూరెన్స్ తీసుకోకుండా తప్పు చేస్తున్నారనుకునేలా చేస్తాయి. దీని పైన మీ జేబుకు తగినట్లుగా పెద్ద ఇన్సూరెన్స్ కవర్ అందుబాటులోకి వస్తుంది. రూ. 490, 554 లేదా రూ. 635 నెలవారీ ప్రీమియంతో రూ. 1 కోటి బంపర్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మంచిది..

Term Insurance Plan: కోటి రూపాయల ఇన్సూరెన్స్ ప్లాన్‌ అవసరమా? కవరేజ్‌ను ఎలా నిర్ణయిస్తారు?
Insurance Plan
Follow us
Subhash Goud

|

Updated on: Jul 30, 2023 | 11:48 AM

ఐటీ కంపెనీలో పనిచేస్తున్న అమిత్, టర్మ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అతను రెండు సార్లు గూగుల్‌లో వెతికిన తర్వాత, రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయమని మెసేజ్‌లు రావడం ప్రారంభం అయింది. అమిత్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌తో మాట్లాడినప్పుడు, అతను కూడా త్వరగా కోటి రూపాయల కవర్‌ను కొనుగోలు చేయమని సలహా ఇచ్చాడు. అయితే అమిత్‌కి కోటి రూపాయల ఇన్సూరెన్స్ అవసరమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ టర్మ్ ప్లాన్ కవర్‌ను రూ. 1 కోటి మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. పెద్ద సెలబ్రిటీల ప్రోమోలు.. వారి పంచ్ లైన్‌లు మీరు రూ. 1 కోటి ఇన్సూరెన్స్ తీసుకోకుండా తప్పు చేస్తున్నారనుకునేలా చేస్తాయి. దీని పైన మీ జేబుకు తగినట్లుగా పెద్ద ఇన్సూరెన్స్ కవర్ అందుబాటులోకి వస్తుంది. రూ. 490, 554 లేదా రూ. 635 నెలవారీ ప్రీమియంతో రూ. 1 కోటి బంపర్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మంచిది. అయినప్పటికీ, ఇదంతా ఇన్సూరెన్స్ కంపెనీల మార్కెటింగ్ జిమ్మిక్కు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే, ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఇలా ఫిక్స్ చేయడం సాధ్యం కాదు. ఇన్సూరెన్స్ రక్షణ అనేది వ్యక్తి వార్షిక ఆదాయం, బాధ్యతలు, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది అని ప్రమోర్ ఫిన్‌టెక్ డైరెక్టర్ నిషా శాంఘ్వి చెబుతున్నారు. టువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరికీ రూ. 1 కోటి కవర్ ఇచ్చే టర్మ్ ప్లాన్ అవసరం లేదు అని ఆమె అంటున్నారు.

ఇన్సూరెన్స్ కవరేజ్‌ను ఎలా నిర్ణయిస్తారు?

ఇన్సూరెన్స్ కవర్‌ను లెక్కించేందుకు థంబ్ నెయిల్ కండిషన్ ఒకటి ఉంది. అది మీరు మీ వార్షిక ఆదాయానికి 10 రెట్లు ఇన్సూరెన్స్ రక్షణను కలిగి ఉండాలి. ఆర్థిక బాధ్యత పెరగడంతో పాటు కవర్ పరిమాణం కూడా పెరగాలి. దీనిని ఈ విధంగా అర్థం చేసుకోండి. అమిత్ వార్షికాదాయం రూ.6 లక్షలు ఉంటే, రూ.60 లక్షల కవర్ తో టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అమిత్ కు ఇద్దరు పిల్లలు ఉంటే వచ్చే 5 ఏళ్లలో వారి చదువు ఖర్చులు రూ.10 లక్షలు అవుతాయి. అప్పుడు ఈ మొత్తాన్ని కవర్‌కు జోడించాలి. అమిత్‌కు ఇప్పటికే హోమ్ లోన్ ఉంటే దాని బకాయి మొత్తం రూ. 20 లక్షలు అయితే, ఈ మొత్తం కూడా ఇన్సూరెన్స్ కవర్‌లో చేర్చుకోవాలి. అందువల్ల అమిత్‌కి రూ.90 లక్షల కవర్‌తో కూడిన టర్మ్ ప్లాన్ సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

అదేవిధంగా ద్రవ్యోల్బణం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ సాధారణంగా 15 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ఇప్పుడు 1 కోటి రూపాయల కవర్ తీసుకుంటే .. సగటు వార్షిక ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటే, 15 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం 48 లక్షల రూపాయలకు సమానంగా ఉంటుంది. అదేవిధంగా 20 సంవత్సరాల తర్వాత కోటి రూపాయల విలువ 37.38 లక్షలు అవుతుంది. 25 ఏళ్ల తర్వాత 29.53 లక్షలు, 30 ఏళ్ల తర్వాత 23.13 లక్షలుగా అవుతుంది. ద్రవ్యోల్బణం సగటున 5 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఈ మొత్తం విలువ మరింత తక్కువగా ఉంటుంది.

అయితే మీ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అనేది ఒక కోటితో స్థిరపడకుండా మీ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోండి. ఈ సమయంలో ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా చేర్చాలి. దేశంలో ఉన్నత విద్య సగటు వ్యయం ఏటా ఎనిమిది శాతం చొప్పున పెరుగుతోందని గుర్తుంచుకోండి. పిల్లవాడు బీటెక్ చేయాలనుకున్నా, ప్రస్తుత ఖర్చు రూ. 10 లక్షలు అయితే, 10 ఏళ్ల తర్వాత రూ.21.58 లక్షలు కావాలి. అటువంటి పరిస్థితిలో, వార్షిక ఆదాయం పెరిగినప్పుడు ఇన్సూరెన్స్ రక్షణను కూడా పెంచాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి