AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సమయం ఉంది మిత్రమా..! తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 3 నెలల రేషన్‌ బియ్యం పంపిణీ గడువు పెంపు..!

Telangana: ఇప్పటివరకు మూడు నెలల కోటా రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులు ఈ పొడిగించిన ఐదు రోజుల అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే రేషన్ దుకాణాల్లో బియ్యం అందుబాటులో ఉంటాయి. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత..

Telangana: సమయం ఉంది మిత్రమా..! తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 3 నెలల రేషన్‌ బియ్యం పంపిణీ గడువు పెంపు..!
Ration Distribution
Subhash Goud
|

Updated on: Sep 02, 2026 | 11:40 AM

Share

Telangana: తెలంగాణలోని రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సేకరణ గడువును ప్రభుత్వం తాజాగా సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించింది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మొత్తం మూడు నెలల బియ్యం కోటాను ఒకేసారి లబ్ధిదారులకు అందించాలని జూలై నెలాఖరులోనే నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: House Construction: ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు..!

గడువు పొడిగింపునకు కారణాలు:

పూర్తి కోటా పంపిణీ ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభమై, ఆగస్టు 31 నాటికి ముగియాల్సి ఉంది. అయితే ఈ కింది కారణాల వల్ల ప్రభుత్వం పంపిణీ గడువును మరో 5 రోజులు పొడిగించాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

రేషన్ షాపుల వద్ద తీవ్ర రద్దీ:

ఒకేసారి మూడు నెలల కోటా ఇస్తుండటంతో డీలర్లు, రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. రాఖీ పండుగ సెలవులు: రాఖీ పౌర్ణమి సందర్భంగా అనేకమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లడం వల్ల గడువులోగా బియ్యం తీసుకోలేకపోయారు.

సన్నబియ్యం లభ్యత స్పష్టత:

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్నబియ్యం లభించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

లబ్ధిదారులకు అధికారుల కీలక సూచనలు:

ఇప్పటివరకు మూడు నెలల కోటా రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులు ఈ పొడిగించిన ఐదు రోజుల అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే రేషన్ దుకాణాల్లో బియ్యం అందుబాటులో ఉంటాయి. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత కోటా పొందే అవకాశం ఉండదని, అందుకే ఆ లోపే సమీప పోర్టబిలిటీ లేదా తమ కేటాయించిన రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యాన్ని తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా  చదవండి: Insurance Claim: వాహనదారులకి ఊరటనిచ్చే తీర్పు.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!

ఇది కూడా చదవండి: AI App: కోడింగ్ రాకపోయినా AI యాప్ తయారీ.. 3 రోజుల్లో 2.5 లక్షలు సంపాదించిన 13 ఏళ్ల చిన్నారి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us