AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Construction: ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు..!

House Construction: ఈ అంచనాలో డోర్స్‌, విండోస్ ఖర్చులు చేర్చలేదు. ఒక సింగల్ డోర్, రెండు విండోస్ కోసం అదనంగా రూ.9,000 నుండి రూ.12,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి, మెటీరియల్ రవాణా ఖర్చులను బట్టి మారే అవకాశం ఉంది. ఈ ప్రణాళిక తక్కువ ఖర్చుతో..

House Construction: ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు..!
Build A Single Room Shed House
Subhash Goud
|

Updated on: Sep 02, 2026 | 9:48 AM

Share

House Construction: తక్కువ ఖర్చుతో సింగిల్ రూమ్ రేకుల ఇల్లు నిర్మించాలనుకునే వారికి ఈ కథనం సమగ్రమైన వివరాలను అందిస్తుంది. ఒక బిల్డింగ్ పైన 12 అడుగుల 6 అంగుళాల పొడవు, 10 అడుగుల 6 అంగుళాల వెడల్పు గల సింగిల్ రూమ్ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు, ఉపయోగించే మెటీరియల్స్, మేస్త్రీ ఖర్చులను లెక్కలేసుకోవడం చాలా ముఖ్యం. మొత్తం నిర్మాణ వ్యయం సుమారు రూ.95,000 నుండి రూ.1,00,000 వరకు ఉంటుంది.

ఇది కూడా చదవండి: Insurance Claim: వాహనదారులకి ఊరటనిచ్చే తీర్పు.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!

నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్స్,వాటి ఖర్చులు:

బిల్డర్స్‌, మేస్త్రీలు తెలిపిన వివరాల ప్రకారం..

1. బ్లాక్స్:

  • నిర్మాణంలో లైట్ వెయిట్ 4 అంగుళాల బ్లాక్స్ ఉపయోగిస్తారు. ఇవి బరువును తగ్గిస్తాయి.
  • ఒక్కో బ్లాక్ ధర రూ.45.
  • సింగిల్ రూమ్‌కు సుమారు 160 బ్లాక్స్ అవసరం అవుతాయి.
  • మొత్తం బ్లాక్స్ ఖర్చు: 160 x రూ.45 = ₹7,200.

2. సిమెంట్:

  • పిల్లర్స్, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ వర్క్ కోసం సుమారు 25 సిమెంట్ బస్తాలు అవసరం.
  • ఒక్కో బస్తా ధర రూ.300.
  • మొత్తం సిమెంట్ ఖర్చు: 25 x రూ.300 = రూ.7,500.

3. ఇసుక:

  • పిల్లర్స్ దగ్గర నుంచి ప్లాస్టింగ్ వరకు సుమారు రెండు ట్రాక్టర్ల ఇసుక పడుతుంది.
  • ఒక్కో ట్రాక్టర్ ఇసుక ధర రూ.3,500.
  • మొత్తం ఇసుక ఖర్చు: 2 x రూ.3,500 = రూ.7,000.

4. కంకర:

  • పిల్లర్స్ వేయడానికి, కబోర్డ్స్, డోర్స్ పైన సెల్ఫ్స్ కోసం సుమారు 0.5 యూనిట్ కంకర అవసరం.
  • మొత్తం కంకర ఖర్చు: రూ.3,600 నుండి రూ.4,000 వరకు.

5. స్టీల్:

  • పిల్లర్స్, కాంక్రీట్ బెడ్స్ కోసం స్టీల్ అవసరం.
  • 12 mm రాడ్స్ (4): ఒక్కొక్కటి రూ.670 చొప్పున రూ.2,680.
  • 6 mm రాడ్స్ (5): ఒక్కొక్కటి రూ.120 చొప్పున రూ.600.
  • 8 mm రాడ్స్ (4): ఒక్కొక్కటి రూ.300 చొప్పున రూ.1,200.
  • మొత్తం స్టీల్ ఖర్చు: రూ.2,680 + రూ.600 + రూ.1,200 = రూ.4,480.

6. పైకప్పు రేకులు:

  • ఈ నిర్మాణంలో రెండు రూములకు కలిపి రేకులు వేయడానికి రూ.40,000 ఖర్చు అవుతుంది.
  • సింగిల్ రూమ్‌కు దీనిలో సగం అంటే రూ.20,000 ఖర్చు అవుతుంది.

7. మేస్త్రీ, హెల్పర్ ఖర్చులు:

పిల్లర్స్ వేయడం నుంచి రేకులు వేయడం, బ్లాక్ వర్క్, ప్లాస్టింగ్ వరకు మేస్త్రీ, హెల్పర్లకు సుమారు రూ.35,000 నుండి రూ.40,000 వరకు ఖర్చు అవుతుంది.

  • మొత్తం నిర్మాణ వ్యయం (అంచనా):
  • బ్లాక్స్: రూ.7,200
  • సిమెంట్: రూ.7,500
  • ఇసుక: రూ.7,000
  • కంకర: రూ.3,600 – రూ.4,000
  • స్టీల్: రూ.4,480
  • రేకులు: రూ.20,000
  • మేస్త్రీ, హెల్పర్: రూ.35,000 – రూ.40,000
  • మొత్తం: రూ.94,780 నుండి రూ.1,00,000 వరకు.

ఈ అంచనాలో డోర్స్‌, విండోస్ ఖర్చులు చేర్చలేదు. ఒక సింగల్ డోర్, రెండు విండోస్ కోసం అదనంగా రూ.9,000 నుండి రూ.12,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి, మెటీరియల్ రవాణా ఖర్చులను బట్టి మారే అవకాశం ఉంది. ఈ ప్రణాళిక తక్కువ ఖర్చుతో చిన్న ఇల్లు నిర్మించాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా రూమ్ ప్లాన్, భవిష్యత్ విస్తరణ అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు