Aadhaar-PAN Link: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. మే 31లోపు ఆ పని చేయకపోతే పెనాల్టీ తప్పదు..
ఆధార్ పాన్ లింక్ అయ్యి ఉందో లేదో తనిఖీ చేసుకోండి. ఒకవేళ లింక్ అయ్యి లేకపోతే వెంటనే చేసేయండి.. మే 31లోపు ఆ పనిని పూర్తి చేయకపోతే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(టీడీఎస్), ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(టీసీఎస్) చాలా ఎక్కువగా వసూలు చేస్తారు. ఈ విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తన సోషల్ మీడియా ప్లాట్ పారంలో షేర్ చేసింది.

మీరు ఆదాయ పన్ను పరిధిలో ఉన్నారా? ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? అయితే మీకో అలర్ట్. మీరు ఆధార్ పాన్ లింక్ అయ్యి ఉందో లేదో తనిఖీ చేసుకోండి. ఒకవేళ లింక్ అయ్యి లేకపోతే వెంటనే చేసేయండి.. మే 31లోపు ఆ పనిని పూర్తి చేయకపోతే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(టీడీఎస్), ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(టీసీఎస్) చాలా ఎక్కువగా వసూలు చేస్తారు. ఈ విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తన సోషల్ మీడియా ప్లాట్ పారంలో షేర్ చేసింది. పన్ను చెల్లింపుదారులు అందరూ మే 31లోపు తమ ఆధార్, పాన్ లింక్ చేయాలని మే 28న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఎక్స్(ట్విట్టర్) ప్లాట్ ఫారంలో ఓ పోస్ట్ పెట్టంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Kind Attention Taxpayers,
Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.
Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI
— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024
ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా పోస్టులో ఏముంది..
పన్ను చెల్లింపుదారులందరూ తప్పనిసరిగా తమ ఆధార్-పాన్ లింక్ చేయాలని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. లేకుంటే అధికంగా టీడీఎస్/టీసీఎస్ కట్ అవుతుందని పేర్కొంది. ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం ఇది జరుగుతుందని చెప్పింది. ఆపరేషన్లో లేని ప్యాన్ కారణంగా మార్చి 31 నుంచే లావాదేవీలు నిలిచిపోయాయని పేర్కొంది. ఎందుకంటే ఆధార్ తో లింక్ చేయని పాన్ నంబర్ ఆటోమేటిక్ గా ఇన్ ఆపరేటివ్ గా మారిపోతాయి. ఈ మేరకు ఏప్రిల్ 23న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఓ సర్కులర్ ను పబ్లిష్ చేసింది. ఈ సర్కులర్ లోనే పలు నిబంధనలను సైతం పేర్కొంది. ఒకవేళ ఆధార్ పాన్ లింక్ చేయకపోతే జరిగే పర్యావసనాలను కూడా వివరించింది.
ఎవరు ఆధార్, పాన్ లింక్ చేయాలి?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం జూలై 1, 2017 నాటికి శాశ్వత ఖాతా నంబర్ (పాన్) కేటాయించబడిన, ఆధార్ నంబర్ను పొందేందుకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తి తన ఆధార్ నంబర్ను లింక్ చేయాలి. మీరు 30 జూన్ 2023 లోపు మీ పాన్ ను మీ ఆధార్తో లింక్ చేయకుంటే, మీ పాన్ పనిచేయకుండా పోతుంది. అయితే, మినహాయింపు పొందిన కేటగిరీ కిందకు వచ్చే వ్యక్తులు పాన్ పనిచేయకుండా పోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఉండవు.
ఆన్ లైన్లో ఆధార్తో పాన్ను ఎలా లింక్ చేయాలి..
- ఆదాయపు పన్ను వెబ్ సైట్ ని సందర్శించండి.
- క్విక్ లింక్స్’ కింద, ‘లింక్ ఆధార్’ పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్ పేర్కొన్న విధంగా పాన్, ఆధార్ నంబర్, పేరును ఎంటర్ చేయండి.
- పాన్ నంబర్, ఆధార్ నంబర్, ఆధార్ పై మీ పేరు మీ మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి, పుట్టిన సంవత్సరం మాత్రమే పేర్కొన్నట్లయితే అక్కడ బాక్స్ లో టిక్ చేయండి మీ ఆధార్ వివరాలను ధ్రువీకరించడానికి మీరు అంగీకరించే పెట్టెలో కూడా టిక్ చేయండి.
- ‘లింక్ ఆధార్’పై క్లిక్ చేయండి.
- క్యాప్చా కోడ్ ను నమోదు చేయండి. ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వస్తుంది.
- అది ఎంటర్ చేసి వ్యాలిడేట్ బటన్ ని నొక్కండి.
- రూ. 1,000 జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే మీరు మీ ఆధార్, పాన్ను లింక్ చేయగలరని గమనించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




