Tax saving Tips: పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ట్యాక్స్ సేవ్ చేసే 4 బెస్ట్ స్కీమ్స్ మీకోసం..
Tax saving Tips: పెట్టుబడి పెట్టడం యవ్వనంలో ఉన్నవారు మాత్రమే చేసేది కాదు. సీనియర్ సిటిజన్లు కూడా తమ డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టొచ్చు.
Tax saving Tips: పెట్టుబడి పెట్టడం యవ్వనంలో ఉన్నవారు మాత్రమే చేసేది కాదు. సీనియర్ సిటిజన్లు కూడా తమ డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. అందులో ముఖ్యంగా రిస్క్ ఫ్రీ రిటర్న్స్‌లో పెడితే ప్ ప్రయోజనం ఉంటుంది. వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పన్ను-పొదుపును ప్రారంభించడం ఉత్తమం. ఇందులో సీనియర్ సిటిజన్లకు ఉన్న మరో ప్లస్‌పాయింట్ ఏంటంటే.. సాధారణ వ్యక్తుల కంటే మెరుగైన రాబడిని పొందే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా.. పన్ను చెల్లింపుదారులు FY 2022-2023కి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు లేదా పాత విధానాన్ని కొనసాగించవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన 4 పన్ను-పొదుపు స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. పన్ను రహిత బాండ్లు..
ద్రవ్యోల్బణాన్ని అధిగమించగల, మంచి రాబడిని కోరుకునే సీనియర్ సిటిజన్‌లకు ఇది మంచి పెట్టుబడి సాధనం. ప్రభుత్వం మద్దతుతో, ఈ బాండ్‌లపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇవి అధిక పన్ను పరిధిలో ఉన్న వ్యక్తులకు రిస్క్ ఫ్రీ పెట్టుబడులుగా ఉంటుంది.
2. 5-సంవత్సరాల ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు..
పేరుకు తగ్గట్లుగానే.. ఈ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వచ్చే ఒక రకమైన పెట్టుబడి. ఖాతా మెచ్చూరిటీకి వచ్చే వరకు పథకం కింద ముందస్తు ఉపసంహరణకు ఛాన్స్ ఉండదు. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం, ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పన్ను మినహాయింపులు ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు లభిస్తాయి. అంతేకాదు.. ఇవి డిఐసీజీసీ ద్వారా రిస్క్ ఫ్రీ రిటర్న్‌లు, పన్ను మినహాయింపులు, డిపాజిటి సెక్యూరిటీతో సహా ట్రిపుల్ ప్రయోజనాలను అందిస్తుంది. నెలవారీ, త్రైమాసికం లేదా అదే వడ్డీని పునఃపెట్టుబడిగా మార్చుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)..
ఇందులో పెట్టుబడి పెడితే.. సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను పొందుతారు. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి వస్తుంది ఇందులో. 60 ఏళ్లు పైబడిన వ్యక్తి గరిష్టంగా రూ. 15 లక్షల డిపాజిట్ చేయొచ్చు. కనిష్టంగా రూ. 1,000 లతో పోస్టాఫీసులో ఈ SCSS అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం కింద చేసే చెల్లింపులు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం ఇది బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ ఉంటుంది.
4. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)..
ఇది స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీచే నిర్వహించబడుతుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ చందాదారులకు ఈక్విటీ, డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లను అందిస్తుంది. అంతేకాకుండా, పెట్టుబడిదారుకు మెచ్యూరిటీ, మొత్తం పెన్షన్ ఉపసంహరణ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వబడుతుంది. సెక్షన్లు 80 CCD (1), 80CCD(1B) కింద పన్ను ఆదా ప్రయోజనాలను అందిస్తుంది. ఎన్‌పిఎస్ ప్రస్తుత వడ్డీ రేటు పరిధి 8 నుంచి 10 శాతం వరకు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..