Tata Motors: కరోనా బాధిత ఉద్యోగుల కుటుంబాలకు బాసట.. ఇతర కంపెనీలకు ఆదర్శంగా టాటా మోటార్స్

కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు బాసటగా నిలవనుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) . ఈ మేరకు ఇతర ప్రైవేటు కంపెనీలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ టాటా మోటార్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Tata Motors: కరోనా బాధిత ఉద్యోగుల కుటుంబాలకు బాసట.. ఇతర కంపెనీలకు ఆదర్శంగా టాటా మోటార్స్
Tata Motors
Follow us
Janardhan Veluru

|

Updated on: May 20, 2021 | 11:46 AM

కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు బాసటగా నిలవనుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) . ఇతర ప్రైవేటు కంపెనీలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ టాటా మోటార్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కాటుకు ఎవరైనా ఉద్యోగి మరిణిస్తే వారి కుటుంబానికి ప్రతి నెలా ఆర్థిక సాయాన్ని అందజేయనుంది ఆ సంస్థ. ఉద్యోగి మృతి చెందిన నాటికి తీసుకుంటున్న మూల వేతనంలో 50 శాతాన్ని ఆ ఉద్యోగి కుటుంబానికి ప్రతినెలా ఆర్థిక సాయంగా అందజేయనున్నారు. ఉద్యోగి రిటైర్మెంట్ వయస్సు వరకు ఈ సాయాన్ని కొనసాగిస్తారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ సాయంగా అందజేసే వన్ టైమ్ ఆర్థిక సాయం(One Time Payout)కి అదనంగా ఈ నెలవారీ ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. కోవిడ్ లేదా మరే కారణం చేతనైనా హఠాన్మరణం చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రస్తుతం ఆ సంస్థ వన్ టైమ్ ఆర్థిక సాయం కింద 20 మాసాల మూల వేతనాన్ని అందజేస్తోంది.

గత ఏడాది కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థలో 47 మంది ఉద్యోగులు కరోనా కాటుకు బలయ్యారు. వీరి కుటుంబాలకు వన్ టైమ్ ఆర్థిక సాయంతో పాటు ప్రతినెలా ఉద్యోగి మూలవేతనంలో 50 శాతాన్ని అందజేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థల్లో ఒక్కటైన టాటా మోటార్స్….ప్రస్తుతం కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్స్, మినీ ట్రక్కులు, ట్రక్కులు, బస్సులను తయారు చేస్తోంది. భారీ సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 45 ఏళ్లకు పైబడిన ఉద్యోగుల్లో 90 శాతం మందికి ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్లు ఇప్పించినట్లు ఆ సంస్థ చీఫ్ ఫినాన్సియల్ ఆఫీసర్ పీబీ బాలాజి తెలిపారు. కోవిడ్ బారినపడే ఉద్యోగులకు మెడికల్ కేర్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, వారి కుటుంబీకులకు సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని సమకూర్చినట్టు తెలిపారు.

బజాజ్ ఆటో ఇలా బాసట… ఇది వరకే కోవిడ్ బారినపడి మరణించే ఉద్యోగుల కుటుంబాలకు బాసటగా నిలుస్తూ… రెండేళ్ల పాటు వేతనాలు కొనసాగిస్తామని బజాజ్ ఆటో సంస్థ ప్రకటించింది. అలాగే ఉద్యోగుల పిల్లలకు ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ ఫండ్‌ను అందజేయనున్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి…మందు బాబులూ.. మ‌ద్యం మంచికేన‌నే భ్ర‌మ‌లో ఉన్నారా.? ఓ సారి ఈ వార్త చూడండి.. మెద‌డు దిమ్మ దిరుగుతుంది.

లాక్‌డౌన్‌ సమయంలో మధ్యప్రదేశ్ పోలీసుల అరాచకం.. మాస్క్ పెట్టుకోలేదని ఓ మహిళను దారుణంగా కొట్టిన ఖాకీలు

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?