Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA EV Car: ఫీచర్స్‌లో టాప్‌ లేపుతున్న టాటా కారు.. ఆ ఈవీ ఎస్‌యూవీ ప్రత్యేకతలెన్నో..!

భారతదేశంలో ఈవీ వాహనాల డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఇటీవల కాలంలో ఈవీ కార్లను కూడా కొన్ని కంపెనీలు మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ ఎట్టకేలకు భారత మార్కెట్లో హారియర్ ఈవీని విడుదల చేసింది. ఈ కారు ధరలు రూ.21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. అయితే తాజాగా ఈ కారు బేస్‌ వేరియంట్‌ ఫీచర్ల వివరాలు ఇవేనంటూ పలు టెక్‌ గ్రూప్స్‌లో వార్తలు హల్‌ చేస్తున్నాయి.

TATA EV Car: ఫీచర్స్‌లో టాప్‌ లేపుతున్న టాటా కారు.. ఆ ఈవీ ఎస్‌యూవీ ప్రత్యేకతలెన్నో..!
Tata Harrier Ev
Follow us
Srinu

|

Updated on: Jun 07, 2025 | 8:30 PM

టాటా హారియర్‌ ఈవీ ఎస్‌యూవీ అడ్వెంచర్, ఫియర్ లెస్, ఎంపవర్డ్ అనే మూడు వేరియంట్లలో అందించనున్నట్లు టాటా మోటర్స్‌ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో బ్రాండ్ హారియర్ ఈవీకు సంబంధించిన అడ్వెంచర్ వేరియంట్‌కు సంబంధించి న్ని లక్షణాలను కూడా ప్రదర్శించింది. అడ్వెంచర్ వేరియంట్, బేస్ వేరియంట్ కావడంతో చిన్న 65 కేడబ్ల్యూహెచ​ బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందిస్తున్నారు. ప్రస్తుతానికి, ఈ బ్యాటరీ ప్యాక్‌ రేంజ్ ఫిగర్లు పెద్దగా తెలియకపోయినా 120 కేడబ్ల్యూ వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఎస్‌యూవీ బ్యాటరీను 20 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 25 నిమిషాల్లో చార్జ్‌ చేయవచ్చని చెబుతున్నారు. ఈ వేరియంట్ బ్యాక్‌ టైర్‌ డ్రైవ్ పవర్ ట్రెయిల్స్‌లో మాత్రమే అందిస్తున్నారు. ఈ కారులో ఎలక్ట్రిక్ మోటారు గరిష్టంగా 234 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టాటా హారియర్‌ ఈవీలో కొత్త అల్ట్రా గ్లైడ్ సస్పెన్షన్ ఉంటుంది. ప్రాథమికంగా ఫ్రీక్వెన్సీ ఆధారిత డంపర్లు ఉంటాయి. నార్మల్, వెట్/రైన్, రఫ్ రోడ్, మల్టీ డ్రైవ్ మోడ్‌లు అంటే స్పోర్ట్, సిటీ, ఎకో ఉంటాయి. దీంతో పాటు డ్రిఫ్ట్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. పెడల్ షిఫ్టర్ల ద్వారా నియంత్రించే నాలుగు రీజెన్ మోడ్లు అందుబాటులో ఉంటాయి. అలాగే టాటా క్రూయిజ్ కంట్రోల్, అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్‌ మద్దతు హారియర్‌ ఈవీ ప్రత్యేకత.

హారియర్ ఈవీ బేస్ వేరియంట్లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఏరో ఇన్‌సర్ట్‌లు, డ్యూయల్-టోన్ పెయింట్, ఎల్‌ఈడీ బై-ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, రెండు చివర్లలో కనెక్ట్ చేసిన లైట్లు, రూఫ్ హౌస్‌, ఇంటిగ్రేటెడ్ సైడ్ స్టెప్స్, రియర్ వైపర్, వాషర్, పుడిల్ లాంప్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే ఈ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్లు ఉన్నాయి. అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక వైపు పార్కింగ్ కెమెరా ఉంది. అలాగే టాటా ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హెల్డ్ కంట్రోల్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హెూల్డ్, బ్రేక్ డిస్క్ వైపింగ్ వంటి లక్షణాలు ఆకట్టుకుంటాయి.

టాటా హారియర్‌ ఎస్‌ 45 వాట్స్‌ యూఎస్‌బీ టైప్‌-సీ ఛార్జింగ్ పోర్ట్‌లు, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్రెస్ట్, టిల్ట్, టెలిస్కోపిక్-అడ్జస్టబుల్ స్టీరింగ్, పార్శిల్ ప్రే, లెథరెట్ సీట్ అప్టోలరీ, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, ఆటో-ఫోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసేలా ఫోల్డబుల్ ఓఆర్‌వీఎంలు ఉన్నాయి. 2025 టాటా హారియర్ ఈవీ అడ్వెంచర్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎనిమిది-వైపులా సర్దుబాటు చేసేలా డ్రైవర్ సీటు, నాలుగు-వైపులా సర్దుబాటు చేసేలా ఫ్రంట్ ప్యాసింజర్ సీటు, వెనుక ఏసీ వెంట్స్, వివిధ టెర్రెన్ మోడ్లు, డ్రిఫ్ట్ మోడ్‌లో సహా మల్టీ డ్రైవ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్, అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ (ఏవీఏఎస్‌) డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ ప్లేలు, ఐఆర్‌ఏ కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, యాపిల​ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కోసం కనెక్టివిటీ, అలాగే ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్‌లతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి