AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suzuki: కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్‌.. సుజుకీ మోటార్ సైకిళ్ల విక్రయాల జోరు..!

Suzuki Motorcycle India Sales: పెళ్లిళ్ల సీసన్ కావడంతో సుజుకీ మోటార్ సైకిల్ విక్రయాలు నవంబర్ మాసంలో జోరందుకున్నాయి. 2024 నవంబర్ మాసంలో 94,370 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2023 నవంబర్ మాసం (87,096 యూనిట్ల విక్రయాలు)తో పోల్చితే 2024 నవంబర్ మాసంలో సుజుకీ మోటార్ సైకిళ్ల విక్రయాల్లో 8 శాతం వృద్ధి నమోదయ్యింది.

Suzuki: కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్‌.. సుజుకీ మోటార్ సైకిళ్ల విక్రయాల జోరు..!
Suzuki Motorcycle India
Janardhan Veluru
|

Updated on: Dec 02, 2024 | 4:13 PM

Share

పెళ్లిళ్ల సీసన్ కావడంతో సుజుకీ మోటార్ సైకిల్ విక్రయాలు నవంబర్ మాసంలో జోరందుకున్నాయి. 2024 నవంబర్ మాసంలో 94,370 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2023 నవంబర్ మాసం (87,096 యూనిట్ల విక్రయాలు)తో పోల్చితే 2024 నవంబర్ మాసంలో సుజుకీ మోటార్ సైకిళ్ల విక్రయాల్లో 8 శాతం వృద్ధి నమోదయ్యింది. ఆ మేరకు జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇందులో గత నెల నవంబర్‌లో దేశీయ వాహన విక్రయాలు 78,333 యూనిట్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో జరిగిన 73,135 యూనిట్ల విక్రయాలతో పోల్చితే 7 శాతం వృద్ధి నమోదయ్యింది.

నవంబర్‌లో పెరిగిన ఎగుమతులు..

అలాగే నవంబర్ మాసంలో 16,037 యూనిట్ల సుజుకీ మోటార్ సైకిళ్లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. 2023 నవంబర్ మాసంలో 13,961 యూనిట్లు ఎగుమతితో పోలిస్తే.. ఈ ఏడాది నవంబరు మాసంలో ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి నమోదయ్యింది.

పెళ్లిళ్ల సీజన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న గిరాకీ కారణంగా మోటార్ సైకిళ్ల విక్రయాలు నవంబర్ మాసంలో వృద్ధిని నమోదు చేసుకున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.

మోటార్ సైకిళ్ల విక్రయాలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనడానికి సంకేతమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిసెంబర్‌లోనూ విక్రయాల జోరు కొనసాగే అవకాశముందని అంచనావేస్తున్నారు.