Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ అందించే బ్యాంకు ఇదే.. ఏకంగా 9.60శాతం వడ్డీ..
ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా పలు ప్రైవేటు ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీని ఎఫ్ డీ లపై అందిస్తున్నాయి. వాటిల్లో నూ అత్యధిక వడ్డీని అందించేది సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) . ఈ బ్యాంకు ఇటీవల రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును అప్‌డేట్ చేసింది.

సురక్షితమైన పెట్టుబడి పథకాలలో ఫిక్స్ డ్ డిపాజిట్ అత్యంత ప్రజాదరణ పొందింది. అధిక వడ్డీతోపాటు పన్ను రాయితీలు కూడా ఉండటంతో అందరూ వీటిలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. అయితే దీనిలో వడ్డీ బ్యాంకును బట్టి మారుతుంటుంది. అలాగే సాధారణ పౌరులకు, సీనియర్ సిటిజెనులకు మధ్య కూడా వడ్డీరేటు మారుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా పలు ప్రైవేటు ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీని ఎఫ్ డీ లపై అందిస్తున్నాయి. వాటిల్లో నూ అత్యధిక వడ్డీని అందించేది సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) . ఈ బ్యాంకు ఇటీవల రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును అప్‌డేట్ చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సాధారణ ప్రజలకు 4.00% నుంచి 7.25% వరకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై వృద్ధులకు 4.50% నుంచి 7.75% వరకు వడ్డీ రేటును ఈ బ్యాంకు ఆఫర్ చేస్తోంది.
కొత్త వడ్డీ రేట్లు ఇలా..
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎఫ్ డీ రేట్లపై వడ్డీలను సవరించడంలో ఈ సూర్యోదయ్ ఎస్ఎఫ్బీ బ్యాంకు కూడా కొత్త రేట్లను ప్రకటించింది. ఐదు సంవత్సరాల కాల పరిమితితో కూడిన ఎఫ్డీ లపై సాధారణ కస్టమర్‌లకు అత్యధిక వడ్డీ రేటు 9.10%, సీనియర్ సిటిజెనులకు 9.60% వడ్డీ రేటును అందిస్తోంది. అంతేకాక సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, తాజా రేట్లు జూలై 5, 2023 నుంచి అమలులో ఉన్నాయి.
వడ్డీ రేట్ల పూర్తి వివరాలు ఇవి..
- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 నుండి 14 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.00% వడ్డీ రేటును అందిస్తోంది.
- 15 నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై 4.25% వడ్డీని ఇస్తోంది.
- 46 రోజుల నుండి 90 రోజుల వరకు ఉండే డిపాజిట్లపై 4.50%, 91 రోజుల నుండి 6 నెలల వరకు ఉంచిన డిపాజిట్లపై 5.00% వడ్డీని అందిస్తోంది.
- 6 నెలల నుంచి 9 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.50% చొప్పున వడ్డీని ఇస్తోంది.
- 9 నెలల నుంచి 1 సంవత్సరం మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు 6.00% వడ్డీని పొందుతాయి.
- 1 సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఎఫ్ డీలపై బ్యాంక్ 6.85% వడ్డీని అందిస్తోంది.
- 1 సంవత్సరం నుంచి 15 నెలలలోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 8.25% వడ్డీ రేటును అందిస్తోంది.
- 15 నెలల నుంచి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ డిపాజిట్ వ్యవధి 8.50% వడ్డీని పొందుతుంది.
- అయితే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ డిపాజిట్ 8.60% వడ్డీ రేటును పొందుతుంది.
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.75% వడ్డీ రేటు, 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే వాటికి 9.10% వడ్డీ రేటు లభిస్తుంది.
- 5 నుండి 10 సంవత్సరాల వ్యవధిలో వడ్డీ 7.25% గా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..