2000 Rupee Note: ఆ ఆలోచన లేదు.. రూ. 2,000 నోట్ల మార్పిడి గడువును పొడిగించే డేట్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ..
2000 Rupee Note Exchange: గత మే నెలలో రూ. 2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో పాటు వాటిని మార్చుకునేందుకు లేదా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కూడా సమయం ఇచ్చారు. అయితే ఇదే అంశంపై..

నోట్లు మార్చుకునేందుకు డేట్ పొడిగింపు పై క్లారిటీ ఇచ్చింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి.. మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం (జూలై 24) 2023 సెప్టెంబర్ 30 తర్వాత రూ. 2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ గడువును పొడిగించే ప్రతిపాదన లేదని తెలిపింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని మంత్రి తెలిపారు.
ఎస్సీపీ నాయకురాలు సుప్రియా సూలేతోపాటు మరో 14 మంది ఎంపీలు డబ్బు నోట్ల రద్దుపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని ప్రశ్నించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఇతర అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని యోచిస్తోందా అనే ప్రశ్న వచ్చింది. నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు తీసుకున్న చర్యలతోపాటు అటువంటి పథకాల వివరాలను కూడా వారు కోరారు.
నల్లధనాన్ని అంతమొందించేందుకు ప్రభుత్వం అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేయాలని యోచిస్తోందా అని సభలో మరో ప్రశ్న తలెత్తింది. దీనిపై కూడా మంత్రి ధీటుగా సమాధానమిచ్చారు.
ఇప్పటి వరకు 76 శాతం నోట్లు వెనక్కి..
ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం, చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడ్డాయి లేదా మార్పిడి చేయబడ్డాయి. మార్కెట్లో ఉన్న రూ.2000 నోట్లు మొత్తం మే 19నాటికే తిరిగి వచ్చినట్లుగా తెలిపారు. రూ.3.56 లక్షల కోట్లు ఉండగా జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి.
రూ. 2000 నోటును 2016లో..
ఇప్పటికే 87 శాతం నోట్లు బ్యాంకు ఖాతాల్లోకి వచ్చాయని ఆర్బీఐ వెల్లడించింది. మిగిలిన 13 శాతం మార్చారు. రూ. 2000 నోటును నవంబర్ 10, 2016న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత అప్పట్లో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను బ్యాన్ చేశారు. ఆ తర్వాత కొత్త రూ. 500 నోటును కూడా తీసుకొచ్చారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం