AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Prices: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. తగ్గని షుగర్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

దేశంలోని సామాన్యులకు బ్యాడ్ న్యూస్ అందింది. చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంకా దిగి రావడం లేదు. గత కొద్ది రోజులుగా ధరలు శాంతించకపోవడంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురవుతుంది. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ధరలు పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

Sugar Prices: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. తగ్గని షుగర్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
Sugar Prices
Venkatrao Lella
|

Updated on: Sep 07, 2026 | 3:14 PM

Share

సామాన్యులకు బ్యాడ్ న్యూస్. చక్కెర్ ధరలు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో చక్కెర ధరలను తగ్గించేందకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ధరలు ఇంకా అదుపులోకి రావడం లేదు. ఇప్పటికీ కిలోకు రూ. 60కిపైగా ధరలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇదే అదునుగా చేసుకుని.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో చక్కెరను ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. కిలోకు రూ. 75 వరకు విక్రయిస్తుండటంతో ప్రజలపై భారం పడుతుంది. త్వరలో వినాయక చవితి, దసరా లాంటి పండుగలు వస్తున్నాయి. దీంతో చక్కెర ధరలు పెరగడం సామాన్యులకు నిరాశగా చెప్పవచ్చు.

ధరలు పెరగడానికి కారణాలేంటి..?

చక్కెర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. జూలైలో కిలో షుగర్ సుమారు రూ.48 వద్ద ఉండగా.. జూలై 20న కిలోకు రూ. 48.18 వద్ద ఉండగా.. ఆగస్టు 20 నాటికి ఏకంగా రూ. 55.70కి చేరుకుంది. కొన్ని మార్కెట్లలో చిల్లర ధరలు కిలోకు రూ. 67 నుంచి రూ. 70 వరకు చేరాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలో ప్రధానంగా భారత్ చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు భారత్ దేశీయ సరఫరాలో కొరత ఎదుర్కొడం చర్చనీయాంశంగా మారింది.

చక్కెర ధరలు ప్రధాన నగరాల్లో ఇలా..

నోయిడాలో కిలో షుగర్ రూ.58 నుంచి రూ.62 మధ్య ఉండగా.. లక్నోలో రూ.50 నుంచి రూ.54, ఢిల్లీలో రూ.55 నుంచి రూ.60, ముంబైలో రూ.60 నుంచి రూ.62, కోల్ కత్తాలో రూ.62 నుంచి రూ.66, హైదరాబాద్‌లో రూ.55 నుంచి రూ.58, బెంగళూరులో రూ.56 నుంచి రూ.60, చెన్నైలో రూ.55 నుంచి రూ.60 మధ్య పలుకుతుంది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో కిలో చక్కెర సగటు చిల్లర ధరలు రూ.44 నుంచి రూ.62 మధ్య ఉన్నాయి. స్థానిక రవాణా ఖర్చులు, నాణ్యతా గ్రేడ్, ప్రాంతీయ టోకు మార్కెట్లను బట్టి ధరలు మారుతూ ఉంటాయి.  దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరగడంతో ప్రభుత్వం 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. దేశీయంగా తగినంత లభ్యతను నిర్ధారించడానికి, నిల్వలను అరికట్టడానికి కూడా ఇది వివిధ చర్యలు తీసుకుంది. వీటిలో చక్కెర డీలర్లపై నిల్వ పరిమితులు విధించడం, బల్క్ వినియోగదారులు నిల్వ చేసుకోగల చక్కెర పరిమాణాన్ని నియంత్రించడం వంటివి ఉన్నాయి.

Follow Us