AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగేళ్ల బాలిక కిడ్నాప్.. ఎవరు తీసుకెళ్లారు..? ఎలా కాపాడారు అంటే..?

నాయనమ్మ వద్ద పెరుగుతున్న నాలుగేళ్ల బాలికను మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లిన దంపతులను పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేశారు. గుంటూరు, విజయవాడ, తిరుపతి, బాపట్ల ప్రాంతాల్లో బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టి, చివరకు రైల్వే పోలీసుల సహకారంతో చిన్నారిని క్షేమంగా రక్షించారు.

నాలుగేళ్ల బాలిక కిడ్నాప్.. ఎవరు తీసుకెళ్లారు..? ఎలా కాపాడారు అంటే..?
Girl Rescued
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 26, 2026 | 11:38 AM

Share

నాయనమ్మ వద్ద పెరుగుతున్న నాలుగేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి, చిన్నారిని క్షేమంగా రక్షించారు. నాయనమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సాయంతో బాలిక ఆచూకీని గుర్తించారు. అనంతరం బాలికను నాయనమ్మకు అప్పగించారు. బాలికను ఎందుకు తీసుకెళ్లారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నగరంలోని సాయిబాబా కాలనీకి చెందిన సాయి పల్లవి (4) తన నాయనమ్మ కొండమ్మ వద్ద పెరుగుతోంది. బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో కొండమ్మే ఆమెను పెంచుతోంది. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన సాయి పల్లవి కనిపించకుండా పోయింది. అదే రోజు బాలిక మేనమామ మనోజ్ కుమార్ కొండమ్మ ఇంటికి రావడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు అందుకున్న లాలాపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను సేకరించి బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో మనోజ్ కుమార్ తన భార్య సుమాయాతో కలిసి బాలికను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 17న బాలికను వెంట తీసుకుని మనోజ్ కుమార్, సుమాయా తొలుత గుంటూరు బస్టాండ్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మనోజ్ వద్ద ఫొటో లేకపోవడంతో అతడిని గుర్తించడం పోలీసులకు కొంత కష్టంగా మారింది. దీంతో బాలిక ఫొటోను ఆర్టీజీఎస్ 360లో అప్‌లోడ్ చేసి దర్యాప్తు కొనసాగించారు. ఆర్టీజీఎస్ 360 ద్వారా బాలికతో కలిసి దంపతులు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం మనోజ్ కుమార్, అతని భార్యకు సంబంధించిన ఫొటోలను సేకరించి వాటిని కూడా 360లో అప్‌లోడ్ చేశారు. ఈ సాంకేతిక ఆధారాల ఆధారంగా వారు వెళ్లిన ప్రాంతాలను పోలీసులు వరుసగా గుర్తిస్తూ వెళ్లారు.

గుంటూరు నుంచి దంపతులు విజయవాడ దుర్గగుడికి వెళ్లి అక్కడ రాత్రి బస చేసినట్లు గుర్తించారు. మరుసటి రోజు తిరుపతికి వెళ్లి, అక్కడి నుంచి బాపట్ల వైపు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. రైల్వే పోలీసులు బాలికతో పాటు మనోజ్ కుమార్, సుమాయాను అదుపులోకి తీసుకుని గుంటూరు పోలీసులకు అప్పగించారు.

బాలికను క్షేమంగా నాయనమ్మ కొండమ్మకు అప్పగించిన లాలాపేట పోలీసులు.. ఆమెను ఎందుకు తీసుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాలికను విక్రయించేందుకు తీసుకెళ్లారా? లేక ఆస్తి వివాదాలకు సంబంధించిన కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. బాలిక క్షేమంగా తిరిగి రావడంతో నాయనమ్మ కొండమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!
బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట..ATM ఛార్జీలు రద్దు
బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట..ATM ఛార్జీలు రద్దు