రిలయన్స్ జియో సంచలనం… 82 లక్షల నయా కస్టమర్స్!

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో దూకుడు కొనసాగుతోంది. జూన్‌లో మరో 82.6లక్షల మంది జియో కనెక్షన్లు తీసుకున్నారు. అయితే అదే సమయంలో అగ్ర టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా మాత్రం తమ చందాదార్లను కోల్పోతూనే ఉన్నాయి. జూన్‌ నెలలో ఈ రెండు కంపెనీలు కలిసి 41.75లక్షల చందాదారులను కోల్పోయాయి. ఈ మేరకు ట్రాయ్‌ గణాంకాలు వెల్లడించాయి. వొడాఫోన్‌ ఐడియా నుంచి 41.45లక్షల మంది, ఎయిర్‌టెల్‌ నుంచి 29,883 మంది చందాదారులు మరో నెట్‌వర్క్‌కు […]

రిలయన్స్ జియో సంచలనం... 82 లక్షల నయా కస్టమర్స్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 20, 2019 | 7:54 AM

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో దూకుడు కొనసాగుతోంది. జూన్‌లో మరో 82.6లక్షల మంది జియో కనెక్షన్లు తీసుకున్నారు. అయితే అదే సమయంలో అగ్ర టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా మాత్రం తమ చందాదార్లను కోల్పోతూనే ఉన్నాయి. జూన్‌ నెలలో ఈ రెండు కంపెనీలు కలిసి 41.75లక్షల చందాదారులను కోల్పోయాయి. ఈ మేరకు ట్రాయ్‌ గణాంకాలు వెల్లడించాయి.

వొడాఫోన్‌ ఐడియా నుంచి 41.45లక్షల మంది, ఎయిర్‌టెల్‌ నుంచి 29,883 మంది చందాదారులు మరో నెట్‌వర్క్‌కు మారారు. దీంతో జూన్‌ చివరి నాటికి వొడాఫోన్‌ ఐడియా మొత్తం చందాదారుల సంఖ్య 38.34కోట్లకు పడిపోయింది. 33.12కోట్ల కనెక్షన్లతో జియో రెండో స్థానంలో ఉండగా.. ఎయిర్‌టెల్‌ 32.03కోట్ల మంది చందాదారులతో మూడో స్థానానికి పడిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ లోపాలతో సతమతమవుతున్నప్పటికీ బీఎస్‌ఎన్‌ఎల్‌ చందాదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూన్‌లో ఈ టెలికాం ఆపరేటర్‌కు కొత్తగా 2.66లక్షల మంది చందాదారులు చేరారు.