AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensex: స్టాక్ మార్కెట్ పరుగులు..వరుసగా రెండో రోజూ లాభాలే.. నిరాశ పరిచిన ఆ బ్యాంకుల షేర్లు!

స్టాక్ మార్కెట్ ఈరోజు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) సెన్సెక్స్ 776 పాయింట్లు (1.35%) లాభపడి 58,461 వద్ద ముగిసింది.

Sensex: స్టాక్ మార్కెట్ పరుగులు..వరుసగా రెండో రోజూ లాభాలే.. నిరాశ పరిచిన ఆ బ్యాంకుల షేర్లు!
Stock Market
KVD Varma
|

Updated on: Dec 02, 2021 | 5:41 PM

Share

Sensex: స్టాక్ మార్కెట్ ఈరోజు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) సెన్సెక్స్ 776 పాయింట్లు (1.35%) లాభపడి 58,461 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 234 పాయింట్లు (1.37%) లాభపడి 17,401 వద్ద ముగిసింది.

మార్కెట్ పెరుగుదలతో ప్రారంభం అయింది 

ఈ ఉదయం సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 57,781 వద్ద ప్రారంభమైంది. టాప్ 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 2 మాత్రమే క్షీణతలో ఉన్నాయి. మిగిలిన 28 షేర్లు లాభాలతో ముగిశాయి. పెరిగిన స్టాక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి, పవర్ గ్రిడ్ 4-4% వరకు పెరిగాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో షేర్లు రెండు, రెండున్నర శాతం మధ్య పెరిగాయి. టైటాన్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డి, ఎన్టీపీసీ కూడా లాభపడ్డాయి. మార్కెట్ క్యాప్ రూ.262.60 లక్షల కోట్లుగా ఉంది.

నిఫ్టీ కూడా పెరిగింది

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ ఈరోజు 17,183 వద్ద ప్రారంభమైంది. ఇది రోజులో 17,149 కనిష్ట స్థాయిని, 17420 ఎగువ స్థాయిని చేరింది. నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 47 స్టాక్స్ లాభపడగా, 3 నష్టపోయాయి. అదానీ పోర్ట్ షేరు 4.53% పెరగగా, పవర్‌గ్రిడ్, హెచ్‌డిఎఫ్‌సి, సన్ ఫార్మా కూడా లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంకులు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

నిన్న మార్కెట్ 620 పాయింట్ల లాభంతో ముగిసింది

అంతకుముందు నిన్న, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) సెన్సెక్స్ 620 పాయింట్లు (1.09%) లాభపడి 57,684 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 183 పాయింట్లు (1.08%) పెరిగి 17,167 వద్ద ముగిసింది. నిన్న, GDP మరియు GST రెండింటిలో పెరుగుదల ప్రభావం మార్కెట్‌పై కనిపించింది.

ఇవి కూడా చదవండి: Navjot Singh Sidhu: ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా సిద్ధూ.. కాంగ్రెస్‌కి ఇక గుడ్ బై చెప్పేయడానికి రెడీ!

Maruti Suzuki: ఇకపై మారుతీ కారు కొనాలంటే షాకే.. భారీగా పెరగనున్న ధరలు.. ఎప్పటినుంచి అంటే..

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎలా గుర్తించారో తెలుసా? అసలు వైరస్‌లలో వైవిధ్యాలను ఎలా గుర్తిస్తారో తెలుసుకోండి!

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే