AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: స్టాక్ మార్కెట్‌లో లాక్‌డౌన్ భయాలు…రూ.8,00,000 కోట్ల మదుపర్ల సంపద హుష్…

Stock market News: కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,708 పాయింట్ల నష్టంతో 47,883 పాయింట్ల దగ్గర ముగిసింది.

Stock Market: స్టాక్ మార్కెట్‌లో లాక్‌డౌన్ భయాలు...రూ.8,00,000 కోట్ల మదుపర్ల సంపద హుష్...
Stock Market
Janardhan Veluru
|

Updated on: Apr 12, 2021 | 3:47 PM

Share

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,708 పాయింట్ల నష్టంతో 47,883 పాయింట్ల దగ్గర ముగిసింది. అటు నిఫ్టీ కూడా 14,350 పాయింట్ల దిగువునకు క్షీణించింది. చివరకు 524 పాయింట్ల నష్టంతో 14,310 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది. క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు 3.5 శాతం మేర సూచీలు నష్టపోయాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల షేర్లు ఏకంగా 9 శాతం మేర నష్టపోగా…ఆటో మొబైల్, ఎనర్జీ, ఫైనాన్షియల్ రంగ షేర్లు 4-5 శాతం నష్టపోయాయి.

భారీ నష్టాల కారణంగా సోమవారం ఒక్కరోజే దాదాపు రూ.8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. దేశంలో మరోసారి లాక్‌డౌన్ అనివార్యమన్న ప్రచారం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 14న జరిగే మహారాష్ట్ర మంత్రివర్గ సమాచారంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ లాక్‌డౌన్ అనివార్యమన్న కథనాలు పారిశ్రామిక వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఉదయం ప్రారంభం నుంచి చివరి వరకు సూచీలు నష్టాల్లో కొనసాగాయి.

ఇవి కూడా చదవండి…ప్రధాని మోదీ ప్రజాదరణ కలిగిన నేత.. అయినా బెంగాల్ పీఠం మమతాదేః ప్రశాంత్ కిశోర్

 మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్‌డౌన్? ఉద్ధవ్ సర్కారు నిర్ణయం ఎప్పుడంటే?