AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soyameal: సోయామీల్‌ ధర తగ్గించేందుకు కేంద్రం చర్యలు.. నిల్వలపై పరిమితులు విధింపు..

పౌల్ట్రీ ఫీడ్ పరిశ్రమలో ముడిసరుకుగా ఉపయోగించే సోయామీల్‌ నిల్వలను అరికట్టడానికి, ధరల పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ పరిమితులను విధించింది....

Soyameal: సోయామీల్‌ ధర తగ్గించేందుకు కేంద్రం చర్యలు..  నిల్వలపై పరిమితులు విధింపు..
Soyameal
Srinivas Chekkilla
|

Updated on: Dec 25, 2021 | 8:24 PM

Share

పౌల్ట్రీ ఫీడ్ పరిశ్రమలో ముడిసరుకుగా ఉపయోగించే సోయామీల్‌ నిల్వలను అరికట్టడానికి, ధరల పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ పరిమితులను విధించింది. ఈ పరిమితులు జూన్ 30, 2022 వరకు అమలులో ఉంటాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వస్తువుల చట్టం, 1955 షెడ్యూల్‌ను సవరించడం ద్వారా జూన్ 30, 2022 వరకు ‘సోయామీల్’ని నిత్యావసర వస్తువుగా ప్రకటించాలని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ప్రభుత్వం నోటిఫై చేసింది. సోయా మీల్ ప్రాసెసర్లు, మిల్లర్లు, ప్లాంట్ యజమానులు గరిష్ఠంగా 90 రోజుల స్టాక్‌ను మాత్రమే కలిగి ఉండాలి, అలాగే నిల్వ స్థానాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నమోదిత వ్యాపార సంస్థలు, వ్యాపారులు గరిష్ఠంగా 160 టన్నుల నిల్వలు ఉంచుకోవచ్చు

స్టాక్‌ నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, వారు దానిని ఆహార మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో ప్రకటించాలి – http://evegoils.nic.in/soya_meal_Stock/logi అయి వివరాలు నమోదు చేయాలి. సోయామీల్ స్టాక్‌ వివరాలను క్రమం తప్పకుండా ప్రకటించాలని, పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని ప్రకటన పేర్కొంది. పోర్టల్‌లోని డేటాను క్రమం తప్పకుండా పర్యవేక్షించనున్నారు. సోయామీల్‌ను నిత్యావసర వస్తువుగా ప్రకటించడం వల్ల కేంద్రం ప్రభుత్వం, రాష్ట్రాలు సోయామీల్ ఉత్పత్తి, పంపిణీని నియంత్రించడంలో సహాయపడతాయి. ఆహార మంత్రిత్వ శాఖ ధరలను అరికట్టడానికి ఈ చర్య తీసుకుంది.

Read Also.. Price Increase: నూతన సంవత్సరంలో ధరల మోత.. పెరగనున్న పలు నిత్యావసర వస్తువులు, వాహనాల ధర..