త్వరలో డోర్ డెలివరీ ద్వారా పెట్రోల్..!

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా డీజిల్‌ను డోర్ డెలివరీ ద్వారా అందిస్తున్న ఈ సంస్థలు ఇక నుంచి పెట్రోల్‌కు కూడా ఆ సదుపాయాన్ని కల్పించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రయోగాత్మకంగా కొన్ని నగరాల్లో మాత్రమే చేస్తున్న డీజిల్ డోర్ డెలివరీని మరో 20 నగరాలకు విస్తరించబోతున్నట్లు సమాచారం. ‘‘ఇంధన డోర్ డెలివరీ సేవలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సేవలను మరింత విస్తరించాలనుకుంటున్నాం. ప్రస్తుతం […]

త్వరలో డోర్ డెలివరీ ద్వారా పెట్రోల్..!
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 5:31 PM

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా డీజిల్‌ను డోర్ డెలివరీ ద్వారా అందిస్తున్న ఈ సంస్థలు ఇక నుంచి పెట్రోల్‌కు కూడా ఆ సదుపాయాన్ని కల్పించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రయోగాత్మకంగా కొన్ని నగరాల్లో మాత్రమే చేస్తున్న డీజిల్ డోర్ డెలివరీని మరో 20 నగరాలకు విస్తరించబోతున్నట్లు సమాచారం. ‘‘ఇంధన డోర్ డెలివరీ సేవలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సేవలను మరింత విస్తరించాలనుకుంటున్నాం. ప్రస్తుతం డీజిల్‌కు మాత్రమే డోర్ డెలివరీ అనుమతి ఉంది. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ త్వరలో పెట్రోల్‌కు కూడా అనుమతులు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి’’ అని హెచ్‌పీసఎల్ ఛైర్మన్ ఎం.కె. సురానా గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

కాగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలైన హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లు 35 నగరాల్లో డీజిల్ డోర్ డెలివరీ సేవలను అందిస్తున్నాయి. ఇవన్నీ తాజాగా మరో 500డోర్ డెలివరీ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ముంబయి లాంటి మహానగరాల్లో నెలకు దాదాపుగా 150కిలో లీటర్ల డీజిల్‌ను డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఓ అంచనా.