SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు.. ఎప్పటివరకంటే!
State Bank Of India: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును..
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఆగష్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే యోనో యాప్ ద్వారా హోం లోన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి 5 బేసిస్ పాయింట్స్ రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది. మహిళా రుణగ్రహీతలు కూడా ఐదు బేసిస్ పాయింట్స్‌కు అర్హులు. గృహ రుణాల వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి ప్రారంభమవుతాయని ఓ ప్రకటన ద్వారా ఎస్బీఐ తెలిపింది.
ఇదిలా ఉంటే గతేడాది సెప్టెంబర్‌లో కూడా ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మినహాయించింది. రిటైల్ కస్టమర్లను పెంచుకునేందుకు ప్రముఖ బ్యాంకుల మధ్య గత కొంతకాలంగా పెద్ద పోటీ నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అమోఘమైన ఆఫర్లతో ఖాతాదారులను ఆకట్టుకుంటున్నాయి.
“వడ్డీ రేటు చారిత్రాత్మక కనిష్ఠ స్థాయిలో ఉన్నందున, గృహ కొనుగోలుదారులు సులభంగా నిర్ణయం తీసుకునేలా, అంతేకాకుండా వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని” ఎస్బీఐ ఎండీ సీఎస్ శెట్టి అన్నారు. ఎస్‌బీఐ హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియో రూ. 5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. మార్చి 31, 2021 నాటికి, బ్యాంక్ CASA(కరెంట్ అకౌంట్, పొదుపు ఖాతా) నిష్పత్తి 46 శాతానికి పైగా, రూ. 25 లక్షల కోట్లకు పైగా అడ్వాన్సులతో దాదాపు రూ .37 లక్షల కోట్ల డిపాజిట్ బేస్‌కు చేరింది.
It’s raining offers for new home buyers! Apply for a Home Loan with NIL* processing fee. What are you waiting for? Visit: https://t.co/N45cZ1V1Db *T&C Apply #HomeLoan #SBI #StateBankOfIndia #MonsoonDhamakaOffer pic.twitter.com/nDbPb7oBhF
— State Bank of India (@TheOfficialSBI) July 31, 2021