AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనదేశంలో 24వేల టన్నుల బంగారం నిరుపయోగంగా ఉందని లెక్కలు.. సరికొత్త గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రతిపాదనలతో బ్యాంకులు

మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరి దేనికీ ఉండదు.. మహిళల దగ్గర డబ్బులుంటే.. ముందుగా బంగారంకొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. అయితే తాజాగా బంగారం డిపాజిట్‌ పథకంలో..

మనదేశంలో 24వేల టన్నుల బంగారం నిరుపయోగంగా ఉందని లెక్కలు.. సరికొత్త గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రతిపాదనలతో బ్యాంకులు
New Gold Deposit Scheme
Surya Kala
|

Updated on: Mar 25, 2021 | 11:39 AM

Share

Gold Deposit Scheme: మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరి దేనికీ ఉండదు.. మహిళల దగ్గర డబ్బులుంటే.. ముందుగా బంగారంకొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. అయితే తాజాగా బంగారం డిపాజిట్‌ పథకంలో భారీ మార్పులను ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ప్రతిపాదించింది. వివరాల్లోకి వెళ్తే..

గోల్డ్ డిపాజిట్‌ స్కీమ్ లో ఇప్పటివరకూ ఎవరైనా సరే కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్‌ చేయాల్సి వచ్చేసింది. అయితే ఇక నుంచి ఈ స్కిమ్ లో చేరేవారికి వీలుగా డిపాజిట్ ను తగ్గించింది. ఇక నుంచి 10 గ్రాముల బంగారం ఉన్నా డిపాజిట్ చేసే వీలు కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దీంతో ఇంట్లో వినియోగానికి లేకుండా ఉండే గోల్డ్ ను డిపాజిట్ చేయడానికి వస్తారని.. తద్వారా వడ్డీ కూడా పొందవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు. ఇలా జీడీఎస్ లో బంగారం డిపాజిట్ చేస్తే.. సదరు బ్యాంక్ జారీ చేసే సర్టిఫికెట్ ను వేరేవారికి బదిలీ చేసే వీలుని కూడా కల్పించనుంది. లేదా ఆ సర్టిఫికెట్ ను అమ్ముకునేందనుకు సరికొత్త రూపకల్పన చేయనుంది.

ఇక బ్యాంకులు బంగారం నగలను, పసిడి కడ్డీలు, నాణేలు వివిధ రూపాల్లో డిపాజిట్లను స్వీకరిస్తాయి. అంతేకాదు.. ఇలా జీడీఎస్డి లో డిపాజిట్ చేసిన బంగారానికి వడ్డీకి ని కూడా డిపాజిట్ దారునకు ఇస్తారు. ఇక ఇలా డిపాజిట్ చేసిన బంగారంకు ఇచ్చే సర్టిఫికెట్ తో కొంతకాలానికి బ్యాంక్ నుంచి రుణాలు కూడా పొందే వీలు కల్పించనున్నారు.

ఈ మేరకు జీడీఎస్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. డిపాజిట్ చేయడానికంటే ముందు బంగారం నాణ్యతపై వర్తకుల నుంచి ధృవీకరణ సర్టిఫికెట్ తీసుకుని బ్యాంక్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కోసం ప్రతి బ్యాంక్ లో ఇద్దరు ఉద్యోగాలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు.. త్వరలో పూర్తి మార్గదర్శకాలను రిలీజ్ చేయనుంది.

గోల్డ్ ను బ్యాంక్ లో డిపాజిట్ చేసేవారికోసం స్పెషల్ యాప్, పోర్టల్ ను రూపొందిస్తుంది. దీనిని నిర్వహణ ఎస్బిఐ చూసుకోనుంది. దేశంలో అనేక ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో, బ్యాంక్ లాకర్లలో నిరుపయోగంగా దాదాపు 24వేల టన్నుల బంగారం ఉందని అంచానా.. దీంతో పసిడి డిపాజిట్ పథకానికి ఆదరణ పెంచితే.. ఆర్ధిక వనరులుగా ఉపయోగం పెరుగుతుందని ఆర్ధిక శాఖ భావిస్తున్నారు.

Also Read: రేపు భారత్ బంద్.. జగన్ సర్కార్ సంపూర్ణ మద్దతు.. వాటికి మాత్రమే మినహాయింపు.!

సముద్రంలోకి దూసుకెళ్లిన రెండు బాలిస్టిక్ క్షిపణులు, నార్త్ కొరియా మరో ప్రయోగం., జపాన్ ఆగ్రహం