జాక్ పాట్ కొట్టేసింది, పంజాబ్ లో తుక్కు సామాన్ల డీలర్ భార్యకు లాటరీలో రూ. కోటి ప్రైజ్

ఏ నిముషానికి ఎవరిని ఒక్కసారిగా అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అనుకోకుండా వచ్చి పడే ధనయోగానికి కొందరు మాత్రమే అర్హులవుతారు. సిరికి కూడా సరైన సమయం రావాలంటారు.

  • Publish Date - 11:51 am, Thu, 25 March 21 Edited By: Anil kumar poka
జాక్ పాట్ కొట్టేసింది, పంజాబ్ లో తుక్కు సామాన్ల డీలర్ భార్యకు లాటరీలో రూ. కోటి ప్రైజ్
Scrap Dealer's Wife Wins Rs. 1 Crore First Prize Of Punjab State Lottery

ఏ నిముషానికి ఎవరిని ఒక్కసారిగా అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అనుకోకుండా వచ్చి పడే ధనయోగానికి కొందరు మాత్రమే అర్హులవుతారు. సిరికి కూడా సరైన సమయం రావాలంటారు. పంజాబ్ లో తుక్కు సామాన్లు అమ్మే డీలర్ భార్యకు లాటరీలో కోటి రూపాయలు వచ్చి పడ్డాయి. భాగాపురానా లో నివసించే స్క్రాప్ డీలర్ భార్య ఆశారాణి ఇలా జాక్ పాట్ కొట్టేసింది. పంజాబ్ స్టేట్ డియర్ 100 మంత్లీ లాటరీ కింద ఈ భారీ ప్రైజ్ లభించింది. ఈమె నిన్న లాటరీ అధికారులకు తన ప్రైజ్ మనీ లాటరీ టికెట్ చూపి అందుకు తగిన డాక్యుమెంట్లను కూడా సమర్పించింది. ఈ ప్రైజ్  లభించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆమె.. తన జీవితంలో ఇలా భారీ మొత్తాన్ని దక్కించుకుంటానని కలలో కూడా అనుకోలేదని తెలిపింది. ఇది నాకు, నా కుటుంబానికి కలిగిన అదృష్టమని, మా కలలు పండాయని ఆశారాణి వ్యాఖ్యానించింది. మోగా జిల్లా లోని  భాగాపురానాలో  తన భర్త స్క్రాప్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడని , తమకు ఇద్దరు కొడుకులని, వారు కూడా అదే షాపులో పని చేస్తున్నారని ఆమె తెలిపింది.

మాది చిన్న ఇల్లు. మా కుటుంబానికి సరిపోవడంలేదు.. ఈ లాటరీ సొమ్ముతో ఆ ఇంటిని పెద్దది చేసుకుంటాం.. అలాగే మిగతా మొత్తాన్ని మా స్క్రాప్ బిజినెస్ కోసం వాడుకుంటాం అని ఆమె వెల్లడించింది. అలాగే మా అప్పులు కూడా తీర్చుకుంటామని ఆమె తెలిపింది. ఈ ప్రైజ్ మనీని త్వరలో ఆశారాణి అకౌంట్ కి బదిలీ చేస్తామని  పంజాబ్  స్టేట్ లాటరీ డిపార్ట్ మెంట్  అధికారులు తెలిపారు.  అటు ఆశారాణి భర్త కూడా ఈ లాటరీ తమకు తగలడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.  తమ బిజినెస్ సరిగా సాగడం లేదని, ఈ పరిస్థితుల్లో ఈ జాక్ పాట్ తగలడం నిజంగా తమ అదృష్టమేనని ఆయన అన్నాడు.

మరిన్ని చదవండి ఇక్కడ :భారత్‌లో మితిమీరి రెచ్చిపోతున్న కరోనా సెకండ్ వేవ్..18 రాష్ట్రలో లాక్‌డౌన్..? : Coronavirus in India video.

నడిరోడ్డుపై తలస్నానం, షేవింగ్ చేస్తూ హల్ చల్ చేసిన వ్యక్తి. ..వైరల్ అవుతున్న వీడియోలు,ఫోటోలు : man bathing on Road Video

 ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా..వీడి చేష్టలకు నెటిజెన్ల ఫిదా !:Little Boy Funny Video.