SBI Loan Scheme: వ్యాపారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్..ఈ స్కీమ్ కింద రూ.50 లక్షల రుణం..
SBI Loan Scheme: ప్రస్తుతం బిజినెస్ చేసుకునేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తుంటాయి. సామాన్యుడు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు కూడా బ్యాంకులు రుణాలు అందిస్తుంటాయి..
SBI Loan Scheme: ప్రస్తుతం బిజినెస్ చేసుకునేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తుంటాయి. సామాన్యుడు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు కూడా బ్యాంకులు రుణాలు అందిస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చిన్న వ్యాపారులు కూడా ఆర్థికంగా ఎదిగేందుకు రుణం అందిస్తోంది. మీరు మాన్యుఫ్యాక్చరింగ్ లేదా ట్రేడ్ అండ్ సర్వీసెస్ బిజినెస్ కోసం వర్కింగ్ క్యాపిటల్ తీసుకోవాలనుకుంటే SBI రుణం అందిస్తోంది. ఎస్‌బీఐ SME (Small and Medium Enterprise) లోన్ సౌకర్యం కింద రూ. 50 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.
SBI నుండి SME స్మార్ట్ స్కోర్ లోన్ అనేది నగదు క్రెడిట్ / టర్మ్ లోన్ సదుపాయం. SME రంగానికి చెందిన ఏదైనా పబ్లిక్/ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, భాగస్వామ్య సంస్థ, SSI, SBF సెగ్మెంట్ కింద ట్రేడింగ్, సర్వీస్ సెక్టార్ లోన్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
లోన్ ఎలా పొందాలి: తయారీ, వాణిజ్యం, సేవల యూనిట్లకు కనిష్టంగా రూ. 10 లక్షలు, గరిష్టంగా రూ. 50 లక్షల రుణం పొందే సదుపాయం ఉంటుంది. ఇందులో వర్కింగ్ క్యాపిటల్ మార్జిన్‌లో 20 శాతం, టర్మ్ లోన్‌లో 33 శాతం ఉంటుంది. చీఫ్ ప్రమోటర్ / చీఫ్ ఎగ్జిక్యూటివ్ SME స్మార్ట్ స్కోర్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వయస్సు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్‌బీఐ EBLRకి లింక్ చేయబడింది. దీని రుసుము రుణ మొత్తంలో 0.40 శాతంగా నిర్ణయించబడింది. అన్ని రుణాలు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫండ్ కింద కవర్ చేయబడతాయి.