Sovereign Gold Bond: పెట్టుబడిని ముందస్తు ఉపసంహరణ కోసం ఆర్బీఐ షెడ్యూల్‌ విడుదల

బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి ప్లాన్. భౌతిక బంగారానికి బదులుగా, బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు. నేటి బంగారం ధర ప్రకారం మీరు సంవత్సరానికి 4 కిలోల బంగారాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఎనిమిదేళ్ల తర్వాత అప్పటి మార్కెట్ రేటు ప్రకారం బంగారం బదులుగా మీకు డబ్బు వస్తుంది.

Sovereign Gold Bond: పెట్టుబడిని ముందస్తు ఉపసంహరణ కోసం ఆర్బీఐ షెడ్యూల్‌ విడుదల
Sovereign Gold Bond Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Sep 05, 2023 | 2:43 PM

సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను ముందుగానే ఉపసంహరించుకోవడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించింది. ఎస్‌జీబీ​పథకాలు 8 సంవత్సరాలలో పరిపక్వం చెందుతాయి. అయితే, 8 సంవత్సరాలు ముగిసేలోపు తమ పెట్టుబడిని ఉపసంహరించుకోవాలనుకునే పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అక్టోబర్ 2017లో జారీ చేయబడిన 3 సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లలో పెట్టుబడులను అకాల రిడెంప్షన్ కోసం ఆర్బీఐ షెడ్యూల్ ప్రకటించింది. ఈ అవకాశం అక్టోబర్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. వ్యవధికి ముందు పెట్టుబడిని ఉపసంహరించుకోవడానికి అదే వ్యవధిలో దరఖాస్తును సమర్పించాలి. అయితే, ఊహించని సెలవులు తదితరాల కారణంగా ఈ షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చని ఆర్‌బీఐ కూడా స్పష్టం చేసింది.

సావరిన్ గోల్డ్ బాండ్ పథకం: ఉపసంహరణ అప్పీల్ కోసం వివిధ గడువులు:

  • సిరీస్ 3 ఎస్‌జీబీ అక్టోబర్ 16, 2017న జారీ చేయబడింది. సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 6, 2023 వరకు అప్పీల్ చేయడానికి సమయం
  • సిరీస్ 4 సావరిన్ గోల్డ్ బాండ్ అక్టోబర్ 2017న జారీ చేయబడింది. అప్పీల్‌ను సమర్పించడానికి 23 సెప్టెంబర్ నుండి 13 అక్టోబర్ వరకు సమయం.
  • సిరీస్ 5 సావరిన్ గోల్డ్ బాండ్ 30 అక్టోబర్ 2017న జారీ చేయబడింది. దరఖాస్తు చేయడానికి 30 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు సమయం.
  • పైన పేర్కొన్నది అప్పీలు సమర్పణ షెడ్యూల్. ఈ మూడు సిరీస్‌లలో సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) పెట్టుబడి ఉపసంహరణ గడువు అక్టోబర్ 2023 నుండి మార్చి 2024 వరకు ఉంటుంది. మీరు వ్యవధికి ముందు సావరిన్ గోల్డ్ బాండ్ పెట్టుబడిని ఉపసంహరించుకోకపోతే, 2025-26లో అవి మెచ్యూర్ అయిన తర్వాత మీరు దాన్ని పొందవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏమిటి?

బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి ప్లాన్. భౌతిక బంగారానికి బదులుగా, బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు. నేటి బంగారం ధర ప్రకారం మీరు సంవత్సరానికి 4 కిలోల బంగారాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఎనిమిదేళ్ల తర్వాత అప్పటి మార్కెట్ రేటు ప్రకారం బంగారం బదులుగా మీకు డబ్బు వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు ఈ రోజు బంగారం ధర 10 గ్రాములకు రూ.61,000 అనుకుందాం.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో మీరు 100 గ్రాముల బంగారంపై రూ. 6.1 లక్షలు పెట్టుబడి పెట్టండి. ఎనిమిదేళ్ల తర్వాత బంగారం ధర రూ.90,000 అనుకుందాం.. అప్పుడు మీ పెట్టుబడి విలువ రూ.90 లక్షలు అవుతుంది. ఎనిమిదేళ్లలో మీకు కనీసం రూ.30 లక్షల లాభం వస్తుంది. భౌతిక బంగారానికి బదులుగా మీకు రూ. 90 లక్షల నగదు చెల్లించబడుతుంది. అయితే దీని వల్ల మంచి బెనిఫిట్‌ పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి