BMW Electric Car: టెస్లాకు బీఎండబ్ల్యూ చెక్! సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. డిజైన్ చూస్తే కళ్లు జిగేల్ మనాల్సిందే!
బీఎండబ్ల్యూ ఏజీ తన మొదటి ప్రోటో టైప్ ఎలక్ట్రిక్ కార్ ను ఆవిష్కరించింది. ఇది ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లాతో పాటు చైనాకు చెందిన టాప్ బ్రాండ్ బీవైడీతో పోటీ పడనుంది. ప్రస్తుత టెస్లా ఈ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు టెస్లాకు ఏమాత్రం తీసిపోని రీతిలో కొత్త జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. దీని డిజైన్ ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్ల కన్నా భిన్నంగా, ఆకర్షణీయంగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో టాప్ బ్రాండ్ల నుంచి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు కూడా కొత్త కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఆయా కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో ప్రపంచ శ్రేణి లగ్జరీ బ్రాండ్ కార్లు కూడా ఒకదానికి పోటీగా మరొకటి ఎలక్ట్రిక్ కార్లను తీసుకొస్తున్నాయి. ఇదే క్రమంలో బీఎండబ్ల్యూ ఏజీ తన మొదటి ప్రోటో టైప్ ఎలక్ట్రిక్ కార్ ను ఆవిష్కరించింది. ఇది ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లాతో పాటు చైనాకు చెందిన టాప్ బ్రాండ్ బీవైడీతో పోటీ పడనుంది. ప్రస్తుత టెస్లా ఈ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు టెస్లాకు ఏమాత్రం తీసిపోని రీతిలో కొత్త జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. దీని డిజైన్ ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్ల కన్నా భిన్నంగా, ఆకర్షణీయంగా ఉంది.
2025 నాటికి బీఎండబ్ల్యూ తీసుకురావాలనుకుంటున్న ఎలక్ట్రిక్ కార్లలో ఇది కూడా ఒకటి. బీఎండబ్ల్యూ విజన్ న్యూ క్లాస్సే కాన్సెప్ట్ తో ఈ కారును తీసుకొస్తున్నారు. కారును జర్మనీలోని మ్యూనిచ్‌లో వచ్చే వారం నిర్వహించే ఐఏఏ షోలో ప్రదర్శించనున్నారు. ఇదే షోలో మరో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ సైతం కొత్త బ్యాటరీతో శక్తిని పొందే మోడల్స్, అలాగే వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త కారు కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే కార్లలో తలెత్తిన సాఫ్ట్ వేర్ సమస్యలు కారణంగా పోర్ష్, ఆడి కార్ల విడుదల కంటే ఆలస్యంగా మార్కెట్లోకి పరిచయం కానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సరికొత్త డిజైన్.. అదిరే ఫీచర్లు..
బీఎండబ్ల్యూ తీసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కారులో వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా టాప్ క్లాస్ ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా చైనా కంపెనీలైన బీవైడీ కో, ఎన్ఐఓ ఐఎన్సీకి పోటీగా ఈ కారును లాంచ్ చేస్తోంది. దాదాపు దశాబ్ద కాలంగా రెండు డోర్లతో విడుదల చేస్తున్న కూపే తరహా కార్లను బీఎండబ్ల్యూ స్వస్తి చెప్పింది. దీనికి బదులుగా విండ్ స్క్రీన్ ని పెద్దది చేసింది. దీంతో పాటు వాయిస్ కమాండ్స్, హ్యాండ్ మూమెంట్ తో డ్రైవింగ్ చేసే డిజిటల్ డిస్ ప్లే ను అందిస్తోంది. ఇది వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ ఇది..
బీఎండబ్ల్యూ తీసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజ్ గురించి మాట్లాడితే దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ చేస్తే ఏకంగా 800కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే కేవలం అరగంటలో 10శాతం నుంచి 80శాతం వరకూ బ్యాటరీ చార్జ్ అవుతుంది. అయితే గతేడాది మెర్సిడెజ్ బెంజ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ప్రోటో టైప్ ఒకే చార్జ్ తో 1000 కిలోమీటర్ల రేంజ్ ను అందించింది. ప్రస్తుతం అన్ని టాప్ బ్రాండ్ల దృష్టి చైనా మార్కెట్ పైనే ఉంది. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిక్ కార్లను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో టెస్లా, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లు అక్కడ ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..