Ather Electric Scooter: ఏథర్ నుంచి చవకైనా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, రేంజ్ మాత్రం టాప్ క్లాస్
ఏథర్ 450ఎస్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఈ ఏడాది జూన్ లోనే ప్రారంభమయ్యాయి. అధికారికంగా స్కూటర్ ను ఆవిష్కరించిన నాటి నుంచి బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాలసీలను బట్టి రేట్లలో తేడాలుంటాయని కంపెనీ ప్రకటించింది. బుకింగ్స్ కూడా మంచి స్పందన లభించినట్లు కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫెస్టివల్ సీజన్ సమీపిస్తోంది. రానున్న రోజుల్లో వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉన్నాయి. దీంతో అన్ని రంగాల్లోని కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను వినియోగదారులకు ఈ సీజన్లోనే తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. అదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కూడా ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఏథర్ 450ఎస్ స్కూటర్ మార్కెట్లోకి వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ గా ఈ 450ఎస్ స్కూటర్ ను తీసుకొస్తోంది. తమిళనాడులోని హోసుర్ ఫెసిలిటీ లో దీని ఉత్పత్తి జరగుతున్నట్లు ఏథర్ ఏనర్జీ ఫౌండర్ అండ్ సీఈఓ, తరుణ్ మెహ్తా అన్నారు. దీని లాంచింగ్ సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ స్కూటర్ ఇటీవల లాంచ్ అయిన ఓలా ఎస్1 ఎయిర్ తో పోటీ పడనుంది. ఇప్పుడు ఏథర్ 450ఎస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బుకింగ్స్ కు మంచి స్పందన..
ఏథర్ 450ఎస్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఈ ఏడాది జూన్ లోనే ప్రారంభమయ్యాయి. అధికారికంగా స్కూటర్ ను ఆవిష్కరించిన నాటి నుంచి బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాలసీలను బట్టి రేట్లలో తేడాలుంటాయని కంపెనీ ప్రకటించింది. బుకింగ్స్ కూడా మంచి స్పందన లభించినట్లు కంపెనీ చెబుతోంది.
ఏథర్ 450ఎస్ స్పెసిఫికేషన్లు..
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో 3కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ రూ 115 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలోని బ్యాటరీని ఇంట్లో చార్జర్లను వినియోగించి ఆరున్నర గంటల్లో 80శాతం వరకూ చార్జ్ చేయొచ్చు. వందశాతం పూర్తవడానికి ఎనిమిది గంటల 36 నిమిషాలు పడుతుంది. ఈ స్కూటర్లో ని మోటార్ 7.2బీహచ్పీ గరిష్ట శక్తితో పాటు, 22ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఈ స్కూటర్లో మూడు డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. స్పోర్ట్స్ మోడ్, ఈకో మోడ్, రైడ్ మోడ్.



డిజైన్ ఇలా..
ఏథర్ 450ఎస్ డిజైన్ గురించి మాట్లాడాలంటే ఇది దీని సహచర మోడల్ 450ఎక్స్ ను పోలి ఉంటుంది. ముందు వైపు కర్వీ కౌల్ ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది. స్కూటర్ సైడ్ వ్యూ, బ్యాక్ వ్యూ మొత్తం ఏథర్ 450ఎక్స్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ ఏథర్ 450ఎస్ లో ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్లో మార్పులు చేశారు. ధర తగ్గేందుకు ఇది ఉపకరించింది. కొత్త 450 ఎస్ లో ఎల్సీడీ ప్యానల్ తో పాటు మ్యాప్ మై ఇండియా ఆధారంగా పనిచేసే నావిగేషన్ సిస్టమ్ ఇచ్చారు. దీని ప్రారంభ ధర రూ. 1,29,999గా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..