Driving Tips: వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు ఆ లైట్లు వేయాలా..? ఆ పని చాలా తప్పని తెలుసా..?

భారతదేశంలో ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. కేరళలో అయితే వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల గోదావరి, కృష్టా నదులు ఉప్పొంగి నదీ పరీవాహక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే వర్షం ఏ స్థాయిలో వచ్చిన పనులు మాత్రం ఆగవు. అందువల్ల వర్షంలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వర్షంలో కార్లు డ్రైవ్ చేసే వారు కచ్చితంగా హజార్డ్ లైట్స్ ఆన్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ వాహనం ఎదురుగా వస్తుందని, ఎదుటి వాహనం వారు గుర్తు పడతారని భావిస్తారు.

Driving Tips: వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు ఆ లైట్లు వేయాలా..? ఆ పని చాలా తప్పని తెలుసా..?
Hazard Lights
Follow us

|

Updated on: Aug 01, 2024 | 5:30 PM

భారతదేశంలో ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. కేరళలో అయితే వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల గోదావరి, కృష్టా నదులు ఉప్పొంగి నదీ పరీవాహక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే వర్షం ఏ స్థాయిలో వచ్చిన పనులు మాత్రం ఆగవు. అందువల్ల వర్షంలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వర్షంలో కార్లు డ్రైవ్ చేసే వారు కచ్చితంగా హజార్డ్ లైట్స్ ఆన్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ వాహనం ఎదురుగా వస్తుందని, ఎదుటి వాహనం వారు గుర్తు పడతారని భావిస్తారు. అయితే నిజంగా హోరు వానలో డ్రైవింగ్ చేసే సమయంలో హజార్డ్ లైట్స్ వేయాల్సిందేనా? అంటే ఇంటర్నెట్‌లో వివిధ సమాధానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్షంలో తప్పనిసరై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

వాహనాలకు సంబంధించిన హజార్డ్ లైట్లు ఆన్ చేస్తే మనం సాయం కోసం ఇతర వాహన డ్రైవర్లను అభ్యర్థిస్తున్నట్లు అర్థమని నిపుణులు చెబుతున్నారు. మీ వాహనం ఆగిపోయినా లేదా మీకు అత్యవసర సాయం కావాల్సి వచ్చినప్పుడే ఆ లైట్లు వేయాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో హజార్డ్ లైట్లు ఉపయోగించకూడదని హెచ్చరిస్తున్నారు. వాహనదారులు బ్రేక్లను నొక్కుతున్నారో? లేదో? మీ వెనుక ఉన్న డ్రైవర్‌కు అర్థం కాక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే వర్షాకాలంలో హజార్డ్ లైట్లు వేయకుండా ప్రమాదరహిత డ్రైవింగ్ ఎలా చేయాలో? కూడా తెలుసుకుందాం. 

పగటిపూట వర్షంలో డ్రైవ్ చేసే సమయంలో హజార్డ్ లైట్స్ వేయకుండా మీ హెడ్లైట్లను ఆన్ చేయడం సరళమైన పరిష్కారమని చెబుతున్నారు. ఇటీవల చాలా కొత్త కారల్లో ‘ఆటో హెర్ల్యాంప్ ఆన్’ ఫంక్షన్‌తో వస్తున్నాయి. వర్షం పడుతున్నప్పుడు ఆటోమెటిక్‌గా లైట్లు వెలుగుతాయి. ముఖ్యంగా సిగ్నల్ లైట్స్ ఇతర లైట్స్ అన్ని పని చేసేలా పెట్టుకోవడం ఉత్తతమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షంలో డ్రైవింగ్ చేసేటప్పుడు రహదారి పరిస్థితులకు అనుగుణంగా మీ వేగాన్ని సర్దుబాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడి రోడ్లపై ట్రాక్షన్ అనేది సర్వసాధారణంగా మీ ఎదురుగా ఉన్న వాహనానికి కొంచెం దూరంగా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి