AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pensioners: పెన్షన్ దారులకు గమనిక..! NPSలో పెట్టుబడి పెడితే పన్ను ఆదా అవుతుందా..?

Pensioners: జాతీయ పెన్షన్ పథకం (NPS) రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు తోడుగా ఉంటుంది. వారి ఆర్థిక అవసరాలకు ఆసరాగా నిలుస్తుంది. అందుకే చాలామంది ఇందులో

Pensioners: పెన్షన్ దారులకు గమనిక..! NPSలో పెట్టుబడి పెడితే పన్ను ఆదా అవుతుందా..?
Nps
uppula Raju
|

Updated on: Oct 29, 2021 | 9:44 AM

Share

Pensioners: జాతీయ పెన్షన్ పథకం (NPS) రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు తోడుగా ఉంటుంది. వారి ఆర్థిక అవసరాలకు ఆసరాగా నిలుస్తుంది. అందుకే చాలామంది ఇందులోపెట్టుబడి పెడుతున్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహించే ఈ పథకం ఖాతాదారులకు పన్ను ఆదా చేసే అవకాశాన్ని కూడా అందిస్తుంది. అయితే కేవలం పన్ను ఆదా చేయడానికి మాత్రమే ఈ పథకాన్ని ఎంచుకోవాలా లేదా ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా తెలుసుకుందాం.

నేషనల్ పెన్షన్ స్కీమ్‌ని అభివృద్ధి చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక ప్రయోజనాన్ని కల్పించింది. ఇందులో పెట్టుబడి పెడితే సెక్షన్ 80CCD(1b) కింద 50 వేల రూపాయల మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను చెల్లింపుదారుడు రూ.2 లక్షల వరకు మినహాయింపును పొందుతారు. ఈ మొత్తం మీ భవిష్యత్తు కోసం డిపాజిట్ చేస్తారు. NPSలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి సంవత్సరం పన్ను ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగ విరమణ వయస్సులో మొత్తం అందుబాటులో ఉంటుంది.

అలాగే ప్రతి నెలా పెన్షన్ కూడా ఇస్తారు. ఈ విధంగా ఈ పథకం మూడు విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌, ఉద్యోగులతో పాటు స్వయం ఉపాధి పొందేవారు, ఫ్రీలాన్స్ సంపాదించేవారు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎవరైనా అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే అతను ఎన్‌పిఎస్ కింద ఈక్విటీలలో 75 శాతం ఫండ్‌ను ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ డబ్బు స్టాక్ మార్కెట్‌లో కూడా పెట్టుబడి పెడుతారు.

NPS నుంచి ఉపసంహరించుకునేటప్పుడు ఖాతాదారుడు ఫండ్‌లో కొంత భాగాన్ని యాన్యుటీలో డిపాజిట్ చేయాలి. మిగిలిన పింఛను సొమ్మును ఏకమొత్తంలో తీసుకోవచ్చు. యాన్యుటీ కింద ఫండ్ PFRDAకి లింక్ చేయబడిన జీవిత బీమా కంపెనీలోకి వెళ్లిపోతుంది. NPSలో రెండు రకాల ఖాతాలు తెరుస్తారు. టైర్ 1 ఒక వ్యక్తి NPS ఖాతాను తెరిచినప్పుడు, టైర్ 1 ఖాతా ఖచ్చితంగా ఓపెన్‌ చేయాలి. అయితే టైర్ 2 ఖాతా ఐచ్ఛికం. ఖాతాదారు తన సొంత అభీష్టానుసారం తెరవవచ్చు.

Health Tips: బెల్లం, నిమ్మరసం జ్యూస్ సూపర్.. బరువు తగ్గడంలో విముక్తి..

Andhra Pradesh: నేడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ భేటీ.. ఉద్యోగుల డిమాండ్లుకు ఓకే చెప్పేనా..!

Weight Loss: సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించింది.. 32 కిలోలు తగ్గింది.. ఎలాగంటే..