Health Tips: బెల్లం, నిమ్మరసం జ్యూస్ సూపర్.. బరువు తగ్గడంలో విముక్తి..

Health Tips: ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది నానా తంటాలు పడుతున్నారు. కానీ సరైన డైట్‌, వర్కవుట్స్‌ మాత్రం చేయడం లేదు. సులువుగా బరువు తగ్గాలని అనుకుంటే

Health Tips: బెల్లం, నిమ్మరసం జ్యూస్ సూపర్.. బరువు తగ్గడంలో విముక్తి..
Jaggery
Follow us

|

Updated on: Oct 29, 2021 | 9:24 AM

Health Tips: ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది నానా తంటాలు పడుతున్నారు. కానీ సరైన డైట్‌, వర్కవుట్స్‌ మాత్రం చేయడం లేదు. సులువుగా బరువు తగ్గాలని అనుకుంటే అది సాధ్యం కాదు. కచ్చితంగా ఎంతో కొంత శ్రమించాలి. దీనితో పాటు మంచి డిటాక్స్‌ వాటర్ కూడా తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం నిమ్మకాయ, బెల్లం కలిపిన పానీయం సులువుగా బరువు తగ్గిస్తుందని తేలింది. అది ఎలాగో తెలుసుకుందాం.

బెల్లం, నిమ్మ డిటాక్స్ డ్రింక్ దీని కోసం కొంచెం బెల్లం తీసుకోండి. దీన్ని నీటిలో వేసి మరగబెట్టండి. తర్వాత ఫిల్టర్ చేసి అందులో నిమ్మరసం కలపండి. అంతే చల్లారిన తర్వాత తాగాలి. ప్రతి రోజు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, ఖనిజాలు, సెలీనియం, మాంగనీస్, కాపర్‌, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ సమస్యను నయం చేయడంలో కూడా తోడ్పడుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇక నిమ్మకాయను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు. ఇందులో ఫోలేట్, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, ప్రొటీన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. అజీర్ణం, మొటిమలు, రాళ్లు, ఊబకాయం అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసే సామర్థ్యం నిమ్మకాయకు ఉంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

దీపావళి తర్వాత లగ్గాలు షురూ..! కానీ ఉన్నవి 15 ముహూర్తాలు మాత్రమే.. ఎందుకంటే..

Shaktikanta Das: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పునర్నియామకం..

Visakhapatnam: మన్యంలో రెచ్చిపోతున్న స్మగ్లర్లు.. కూరగాయల మాటున గంజాయి తరలింపు..