AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి తర్వాత లగ్గాలు షురూ..! కానీ ఉన్నవి 15 ముహూర్తాలు మాత్రమే.. ఎందుకంటే..

Marriages: పెళ్లి కోసం ఎదురుచూసే యువతీ యువకులకు గుడ్ న్యూస్‌. ఎందుకంటే మంచి రోజులు వస్తున్నాయి. దీపావళి తర్వాత వివాహాల సీజన్ ప్రారంభమవుతుంది.

దీపావళి తర్వాత లగ్గాలు షురూ..! కానీ ఉన్నవి 15 ముహూర్తాలు మాత్రమే.. ఎందుకంటే..
Wedding
uppula Raju
|

Updated on: Oct 29, 2021 | 9:02 AM

Share

Marriages: పెళ్లి కోసం ఎదురుచూసే యువతీ యువకులకు గుడ్ న్యూస్‌. ఎందుకంటే మంచి రోజులు వస్తున్నాయి. దీపావళి తర్వాత వివాహాల సీజన్ ప్రారంభమవుతుంది. నవంబర్ నుంచి డిసెంబర్‌ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది లగ్గాల కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పండితులు ఈ సారి ముహూర్తాలు చాలా తక్కువని చెబుతున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఈ సీజన్‌లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 13 వరకు మాత్రమే వివాహాలకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. అంటే వివాహాలకు మొత్తం 15 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. ఆ ముహూర్తాలలోనే వివాహాలు జరుగుతాయి. హిందువులలో ఏకాదశి నుంచి వివాహాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది నవంబర్ 15న దేవుత్తని ఏకాదశి నుంచి శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. అయితే పెళ్లిళ్లకు తక్కువ వ్యవధి ఉండటంతో చాలా చోట్ల మ్యారేజీ గార్డెన్స్, హోటళ్లు తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.

వివాహ ముహూర్తాలు ఎన్ని రోజులు ఈ సీజన్‌లో మొదటి ముహూర్తం నవంబర్ 15న చివరి ముహూర్తం డిసెంబర్ 13న. దీని ప్రకారం ఈ రాబోయే 2 నెలల్లో 15 శుభ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాదికి ఇక ఇవి మాత్రమే. వచ్చే ఏడాది జనవరి 15, 2022 నుంచి మళ్లీ శుభ ముహూర్తం ప్రారంభమవుతుంది.

వివాహానికి అనుకూలమైన సమయం 2021 సంవత్సరంలో నవంబర్ నెలలో (19, 20, 21, 26, 28, 29, 30) కేవలం 7 తేదీలు వివాహానికి శుభప్రదంగా ఉంటాయి. ఇది కాకుండా డిసెంబర్ నెలలో 1, 2, 5, 6, 7, 11, 12, 13 తేదీలలో 8 శుభ ముహూర్తాలు ఉన్నాయి.

కరోనా విధ్వంసం కారణంగా ప్రతి ఒక్కరూ తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. అయితే ఈసారి వచ్చిన పెళ్లిళ్ల సీజన్‌తో మ్యారేజ్‌ గార్డెన్‌లు, హోటళ్ల నుంచి బ్యాండ్‌లు, డప్పులు, క్యాటరింగ్‌లు, మిఠాయి వ్యాపారులు ఇలా ఎంతో కొంత లబ్ధి పొందుతారని అందరు ఆశిస్తున్నారు. ముహుర్తాలు తక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అందుకే వివాహాలకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే సమీక్షించుకుంటే ఆ కుటుంబాలకు మంచిది.

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డుతో తక్కువ వడ్డీతో రూ. 3 లక్షల వరకు ఋణం పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Badvel Election Bypoll: బద్వేల్ ఎన్నికలకు వరుణుడి ఎఫెక్ట్.. తీవ్ర ఇబ్బంది పడుతున్న పోలింగ్ సిబ్బంది..

Winter Heatlhy Tips: చలికాలంలో తినాల్సిన సూపర్ హెల్తీ ఫుడ్స్ ఇవే.. ఎంటో తెలుసుకోండి..