Andhra Pradesh: నేడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ భేటీ.. ఉద్యోగుల డిమాండ్లుకు ఓకే చెప్పేనా..!
Andhra Pradesh: నేడు ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమావేశం కానుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న..
Andhra Pradesh: నేడు ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమావేశం కానుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. కాగా, ఆర్థిక సమస్యలకు సంబంధించిన అంశాలను ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచారు.
11వ పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల హెల్త్ కార్డులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు వంటి పలు డిమాండ్స్‌ని ప్రభుత్వం ముందు ఉంచారు ఉద్యోగులు. అలాగే.. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షనర్లకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలిన డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ జరుగనున్న సమావేశంలోనే ఉద్యోగులకు బకాయిలు ఎంత ఉందో ప్రభుత్వం ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 11వ పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
Also read:
Corona Virus: మూడో ముప్పు వైపుగా కరోనా కొత్త వేరియంట్.. లైవ్ వీడియో
News Watch: నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని నాయకుల్ని..అగ్గితోటి కడుగు మన రాజకీయ వ్యవస్థల్ని.. వీడియో