WI vs BAN T20 World Cup 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న బంగ్లా, వెస్టిండీస్.. ఓడితే సెమీస్ కష్టమే..!
Today Match Prediction of WI vs BAN: ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 టీ20 మ్యాచులు జరిగాయి. ఇందులో వెస్టిండీస్ జట్టు 6, బంగ్లాదేశ్ టీం 5 మ్యాచుల్లో విజయం సాధించాయి.
WI vs BAN T20 World Cup 2021 Match Prediction: టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారం సూపర్-12 గ్రూప్-ఏలో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఓడిపోయాయి. దీంతో సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇప్పటికే ఇరు జట్లకు కష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు చివరి-4లో చేరుకోవడం కూడా కష్టమనుంది.
ఎప్పుడు: శుక్రవారం, 29 అక్టోబర్, మధ్యాహ్నం 03:30 గంటలకు
ఎక్కడ: షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా
లైవ్: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో మ్యాచును ప్రత్యక్ష ప్రసారం కానుంది.
పిచ్: షార్జా పిచ్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో మరోసారి తన సత్తా చాటుతోంది. ఇది సాధారణంగా మంచి బ్యాటింగ్ ఉపరితలంతో కనిపిస్తోంది. ఇప్పటివరకు పిచ్‌లు బ్యాట్, బాల్ మధ్య సమానమైన పోటీలను సృష్టించాయి.
హెడ్ టు హెడ్: ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 టీ20 మ్యాచులు జరిగాయి. ఇందులో వెస్టిండీస్ జట్టు 6, బంగ్లాదేశ్ టీం 5 మ్యాచుల్లో విజయం సాధించాయి.
వరుసగా రెండు మ్యాచ్ ల్లో విఫలమైన డిఫెండింగ్ చాంపియన్.. ఈ టోర్నీలో ఇప్పటి వరకు పెద్దగా అద్భుతాలు చేయలేదు. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీంపై 55 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కరేబియన్ జట్టు మలుపు తిరుగుతుందని అంతా భావించారు. కానీ, ఒక చివర లెండిల్ సిమన్స్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడటంతో దక్షిణాఫ్రికాపై కూడా పెద్ద స్కోరు చేయలేకపోయారు. ఆ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల పరాజయంతో డిఫెండింగ్ ఛాంపియన్‌లకు సెమీ-ఫైనల్‌కు వెళ్లడం మరింత కష్టతరంగా మారింది.
అన్ని రంగాల్లో విఫలమవుతోన్న బంగ్లా.. బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ కూడా పెద్ద సమస్యగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంకపై బంగ్లాదేశ్ 170 పరుగులు చేసింది. అయితే పేలవమైన బౌలింగ్, బలహీనమైన ఫీల్డింగ్ కారణంగా వారు వరుసగా రెండవ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. మరో ఓటమి ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ముందడుగు వేసేందుకు చాలా కష్టంగా మారనుంది.
లూయిస్ బలమైన ఫామ్‌లో ఉన్నాడు. సిమన్స్ దక్షిణాఫ్రికాతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను ఎవిన్ లూయిస్ ఓ పద్ధతిగా బ్యాటింగ్ చేసి 35 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. లూయిస్ నుంచి వెస్టిండీస్ మరోసారి మంచి ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. కరీబియన్ జట్టు తమ ఇద్దరు స్టార్ ఆల్ రౌండర్లు కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్ నుంచి మంచి ప్రదర్శనలను ఆశిస్తుంది. ఎంతో మంది హిట్టర్లు ఉన్న వెస్టిండీస్ టీం భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ చేరడం కాస్త ఇబ్బంగా మారింది.
డిఫెండింగ్ ఛాంపియన్‌లు రెండు గేమ్‌లలో రెండు పరాజయాల తర్వాత బ్యాటింగ్‌లో ఎలా ముందుకు వెళ్లనున్నారో చూడాలి. సూపర్ 12 దశను దాటడానికి వారు తప్పక గెలవాల్సిందే. బంగ్లాదేశ్ టీం కూడా సూపర్ 12లోకి ప్రవేశించాలంటే ఈ మ్యాచులో తప్పక గెలవాల్సిందే. రెండు జట్లూ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ స్పష్టమైన లోపాలను కనబరిచాయి. వీలైనంత త్వరగా వీటిని పరిష్కరించుకోకుంటే మాత్రం టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.
వెస్టిండీస్ టీంలో అనేక మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లతో నిండిన లైనప్‌కు వ్యతిరేకంగా, ఎడమచేతి వాటం స్పిన్‌కు వ్యతిరేకంగా వారి మ్యాచ్-అప్‌లు క్లిష్టమైనవి కావచ్చు. దీన్ని అధిగమించేందుకు బంగ్లాదేశ్ ఒక మార్గాన్ని కనుగొనగలదా? లేదా చూడాలి.
మీకు తెలుసా? – గేల్ 2021 లో తన 18 టీ20ఐ ఇన్నింగ్స్‌ల్లో దాదాపు 13 ఇన్నింగ్సుల్లో 20 పరుగుల కిందే ఉండిపోయాడు. ఒక మ్యాచులో 50+ స్కోరు సాధించాడు.
– సూపర్ 12 దశలో 9 మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.
వెస్టిండీస్: గాయపడిన ఒబెడ్ మెక్‌కాయ్ లేకపోవడంతో జాసన్ హోల్డర్ జట్టులో చేరాడు. వెస్టిండీస్‌పై కేవలం 6.78 ఎకానమీ రేటు ఉన్న షకీబ్ అల్ హసన్ వెస్టిండీపై కీలకంగా మారనున్నాడు.
వెస్టిండీస్ XI అంచనా: ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, లెండిల్ సిమన్స్/రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో, జాసన్ హోల్డర్/ఒషానే థామస్, అకేల్ హోసేన్, రవి రాంపాల్
బంగ్లాదేశ్: లిటన్ దాస్ ఫాం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యర్థి ఆటలో ఎడమచేతి వాటం స్పిన్నర్ స్థానంలో మరొక ఆఫ్‌స్పిన్నర్‌తో బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
బంగ్లాదేశ్ XI అంచనా: లిటన్ దాస్/సౌమ్య సర్కార్, మొహమ్మద్ నయీమ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హుస్సేన్, నూరుల్ హసన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్/షమీమ్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం