AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డేవిడ్ భాయ్’ ఈజ్ బ్యాక్.. 10 బంతుల్లో 40 పరుగులు.. అదిరే అర్ధ సెంచరీ.. బౌలర్లను ఉతికిఆరేశాడు.!

రోజు తనదైతే ఏ ఆటగాడైనా కూడా తిరిగి ఫామ్‌లోకి రాగలడు. దానిని నిరూపించాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఒక్క ఇన్నింగ్స్‌తో..

'డేవిడ్ భాయ్' ఈజ్ బ్యాక్.. 10 బంతుల్లో 40 పరుగులు.. అదిరే అర్ధ సెంచరీ.. బౌలర్లను ఉతికిఆరేశాడు.!
Afp David Warner T20 World Cup
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 29, 2021 | 9:27 AM

రోజు తనదైతే ఏ ఆటగాడైనా కూడా తిరిగి ఫామ్‌లోకి రాగలడు. దానిని నిరూపించాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఒక్క ఇన్నింగ్స్‌తో ‘డేవిడ్ భాయ్’ ఇజ్ బ్యాక్ అనిపించుకునేలా చేశాడు. తన బ్యాట్‌తో విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ‘ఫామ్ ఇజ్ టెంపరరీ.. క్లాస్ ఇజ్ పర్మనెంట్’ అని క్రికెట్ పండితులు అంటారు. సీనియర్ ఆటగాళ్లు, యువ ప్లేయర్స్.. ఎవరైనా కూడా తమ కెరీర్‌లోని ఒకానొక సమయంలో లో-ఫేజ్‌ని చూడాల్సి వస్తుంది. నిన్నటి వరకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరిస్థితి కూడా ఇంతే. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న వార్నర్.. అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు రెండో విజయాన్ని అందించాడు.

ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శనల కారణంగా డేవిడ్ వార్నర్‌‌ను ఐపీఎల్‌లో కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కూడా తొలగించారు. అంతేకాకుండా టీమ్ మేనేజ్‌మెంట్ అతడి పట్ల అనుచితంగా ప్రవర్తించింది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంట్‌లో వార్నర్ ఆడలేడని మాజీలు సైతం విమర్శలు గుప్పించారు. అయితే ఈ అన్నింటికీ వార్నర్ ఫుల్ స్టాప్ పెట్టాడు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి.. కొంతకాలంగా తలెత్తుతున్న ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాన్ని ఇచ్చాడు. దీనితో అభిమానులు ‘డేవిడ్ భాయ్’ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

10 బంతుల్లో 40 పరుగులు…

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అభిమానులు వింటేజ్ వార్నర్‌ను చూశారు. శ్రీలంక విధించిన 155 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో వార్నర్ మొదట తన ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించాడు. అలాగే 18 పరుగుల వద్ద చమీరా క్యాచ్ చేజార్చడంతో వార్నర్‌కు లైఫ్ వచ్చింది. తద్వారా గేర్ మార్చిన వార్నర్ 31 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. అంటే బౌండరీల రూపంలో వార్నర్ 10 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మొత్తంగా వార్నర్ 154.76 స్ట్రైక్ రేట్‌తో 42 బంతుల్లో 65 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

కాగా, వార్నర్ మళ్లీ ఫామ్‌లోకి తిరిగి రావడంతో అభిమానుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముందు తాను మెగా ఆక్షన్‌లోకి వస్తున్నట్లు వార్నర్ స్వయంగా చెప్పడంతో.. అతడు కొత్తగా వచ్చిన జట్లలో ఒకదానికి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read:

తవ్వకాల్లో దొరికిన 100 ఏళ్లనాటి ప్రేమలేఖ.. అందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

వాకింగ్ ట్రాక్‌పై నల్లటి ఆకారం.. దగ్గరకు వెళ్లి చూడగా సడన్ షాక్.. వైరల్ వీడియో.!