Insurance Tips: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందుగా ఈ విషయాలు చెక్‌ చేసుకోండి..

ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఆరోగ్యంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరోగ్య భీమాను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలని చూస్తున్నారు. భీమా కంపెనీలు కూడా ఈ సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేయడం,..

Insurance Tips: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందుగా ఈ విషయాలు చెక్‌ చేసుకోండి..
Health Insurance
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 10, 2022 | 3:24 PM

ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఆరోగ్యంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరోగ్య భీమాను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలని చూస్తున్నారు. భీమా కంపెనీలు కూడా ఈ సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేయడం, ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్‌ చేసుకునే వెసులుబాటు కల్పించడంతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్య భీమాలను ఎంపిక చేసుకునే ముందు కచ్చితంగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలనే తెలుసా.? ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

* హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకునే ముందు పాలసీలో మీరు ఏయే వ్యాధులకు బీమా కవరేజీని పొందుతున్నారో చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ప్రస్తుతం బాధపడుతోన్న వ్యాధికి బీమా రక్షణ ఉంటుందో లేదో అన్న విషయాన్ని కూడా చూసుకోవాలి.

* ఇక భీమాను ఎంచుకునే విషయంలో చూడాల్సిన మరో అంశం. భీమా సంస్థ ఏయే ఆసుపత్రులలో మీకు నగదు రహిత చికిత్సను అందజేస్తుందో ముందే తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* హెల్త్‌ ఇన్సూరెన్స్‌లతో యాడ్-ఆన్‌లు, రైడర్‌లను పొందినట్లయితే, కచ్చితంగా దాన్ని ఎంచుకోండి. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇది మీకు గొప్ప ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

* హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు కో పేమెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఆసుపత్రిలో అయ్యే మొత్తం ఖర్చును ఇన్సూరెన్స్‌ ద్వారానే పొందవచ్చు. ఒకవేళ కోపేమెంట్‌ ఆప్షన్‌ తీసుకుంటే అయ్యే ఖర్చులో కొంత మేర మీరు చెల్లించాల్సి ఉంటుంది.

* అలాగే మీరు తీసుకునే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో కవర్‌ చేయని విషయాల జాబీతాను రూపొందించుకోండి.

మరిన్ని బిజినెస్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..