Green Card: అమెరికాలో స్థిరపడదామనుకునే వారికి షాక్.. గ్రీన్ కార్డు వేచి చూడక తప్పదంతే..!

భారతదేశంలో ఉన్నత వర్గాలతో పాటు జీవితంలో బాగా స్థిరపడాలనుకునే వారికి అగ్ర రాజ్యం అమెరికా అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడదామనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే చదువు వరకు ఓకే కానీ, అక్కడే స్థిరపడదామనుకునే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తారు. అమెరికా స్థిరపడదామనుకునే వారికి కచ్చితంగా ఆ దేశం ఇచ్చే గ్రీన్ కార్డు ఉండాలి.

Green Card: అమెరికాలో స్థిరపడదామనుకునే వారికి షాక్.. గ్రీన్ కార్డు వేచి చూడక తప్పదంతే..!
Green Card
Follow us
Srinu

|

Updated on: Aug 16, 2024 | 3:40 PM

భారతదేశంలో ఉన్నత వర్గాలతో పాటు జీవితంలో బాగా స్థిరపడాలనుకునే వారికి అగ్ర రాజ్యం అమెరికా అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడదామనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే చదువు వరకు ఓకే కానీ, అక్కడే స్థిరపడదామనుకునే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తారు. అమెరికా స్థిరపడదామనుకునే వారికి కచ్చితంగా ఆ దేశం ఇచ్చే గ్రీన్ కార్డు ఉండాలి. అయితే ఆ గ్రీన్ కార్డు అందరికీ ఇవ్వరు. ప్రస్తుతం గ్రీన్ కార్డు కావాలంటే వందేళ్ల కంటే ఎక్కువ సమయమే వేచి ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  హెచ్1బీ వీసా పొందడంతో అమెరికా స్థిరపడదామనుకుంటే కుదరని గ్రీన్ కార్డ్ పొందడం చాలా కష్టమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డు విషయంలో నిపుణులు హెచ్చరికలను ఓ సారి తెలుసుకుందాం.

గ్రీన్ కార్డ్ అధికారికంగా అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి అక్కడ ప్రభుత్వం జారీ చేసిన అధికారిక పత్రం ఈ గ్రీన్ కార్డు హోల్డర్‌కు శాశ్వత నివాస హోదాను మంజూరు చేస్తుంది. వారు యూఎస్‌లో నిరవధికంగా నివసించడానికి, పని చేయడానికి అనుమతిస్తుంది. అమెరికాలో మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటే యూఎస్ పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. అయితే అధిక సంఖ్యలో భారతీయులు అమెరికాకు వెళ్లడం వల్ల గ్రీన్ కార్డను పొందడంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి యూఎస్ఏ వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. చదువు అనంతరం అక్కడే స్థిరపడాలని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అయితే కొంత మంది యూఎస్ రాయబారులు మాత్రం ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల మాటలు విని అమెరికాకు రావద్దని, అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఇప్పటికే కొన్ని వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, మళ్లీ కొత్త వారికి అవకాశం రావాలంటే వందేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే అమెరికా కూడా 1950ల నాటి వీసా విధానాలను అప్ డేట్ చేయాలని సూచిస్తున్నారు .

చాలా మంది భారతీయ విద్యార్థులు విద్యా రుణాలతో యుఎస్‌కు వస్తున్నారని ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి వీలు కల్పించే మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు చూసుకుని యూఎస్‌లోనే స్థిరపడాలని కోరుకుంటారు. అయితే గ్రీన్ కార్డ్ పొందడం ఒక ప్రత్యేక హక్కు కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం యూఎస్ ఎన్ని గ్రీన్ కార్డ్‌లను ఇవ్వాలనే దానిపై పరిమితిని నిర్దేశిస్తుంది. యూఎస్ సంవత్సరానికి 6,75,000 గ్రీన్ కార్డ్‌లను మాత్రమే జారీ చేస్తుంది. కానీ ఫిబ్రవరి 2024 నాటికి ఒకరి కోసం 34.7 మిలియన్ల మంది ప్రజలు గ్రీన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నారు.  అంటే దాదాపు ప్రతి ఒక్కరు 50 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రతి వంద మంది దరఖాస్తుదారుల్లో కేవలం ముగ్గురికి మాత్రమే గ్రీన్ కార్డు వస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో యూఎస్‌లో స్థిరపడాలి అనుకునే వారు ఈ పరిస్థితులను కూడా అంచనా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..