AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ చెల్లింపులు.. అందుబాటులోకి కొత్త సిస్టమ్..

ఇప్పటి వరకూ ఉన్న నిబంధనల ప్రకారం యూపీఐ సర్వీసు ఉపయోగించుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఆ ఖాతాకు లింక్ చేసిన మొబైల్, ఆధార్ నంబర్లను ఉపయోగించి యూపీఐ ఖాతాలను యాక్టివేట్ చేస్తారు. వీటి ద్వారా వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేసుకునే వీలుంటుంది.

UPI Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ చెల్లింపులు.. అందుబాటులోకి కొత్త సిస్టమ్..
Upi Payments
Madhu
|

Updated on: Aug 16, 2024 | 6:20 AM

Share

ఎవరికైనా డబ్బులు పంపించాలంటే వారి బ్యాంకు ఖాతా నంబర్ చాలా అవసరం. అది ఉంటేనే వారికి డబ్బులు పంపించడానికి వీలుంటుంది. గతంలో బ్యాంకులకు వెళ్లి అవతల వారికి ఖాతాలలో డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ నుంచి చాలా సులభంగా ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)ను ఉపయోగించి చాలా వేగంగా పని జరిగిపోతోంది. షాపింగ్ చేసినా, హోటళ్లకు వెళ్లినా, ప్రయాణం చేసినా యూపీఐ ద్వారా డబ్బులను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. ఈ సేవ పొందటానికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త మరో సర్వీస్ అందుబాటులోకి రానుంది. బ్యాంకు ఖాతాను ఉపయోగించకుండా యూపీఏ చెల్లింపులు చేయవచ్చు.

అందుబాటులోకి కొత్త ఫీచర్..

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తన యూపీఐ సేవను ఫేస్ అన్‌లాక్, కొత్త డెలిగేటెడ్ పేమెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటోంది. అంటే బ్యాంక్ ఖాతాలు లేని వినియోగదారులు కూడా యూపీఐ సర్వీస్ ను ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తోంది. బ్యాంక్ ఖాతా లేకపోవడంతో ప్రస్తుతం యూపీఐని చాలామంది వినియోగించడం లేదు. వారందరికీ మేలు కలిగించడానికి కొత్త ఫీచర్లపై దృష్టి సారించింది.

బ్యాంకు ఖాతా లేకుండానే..

ఇప్పటి వరకూ ఉన్న నిబంధనల ప్రకారం యూపీఐ సర్వీసు ఉపయోగించుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఆ ఖాతాకు లింక్ చేసిన మొబైల్, ఆధార్ నంబర్లను ఉపయోగించి యూపీఐ ఖాతాలను యాక్టివేట్ చేస్తారు. వీటి ద్వారా వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేసుకునే వీలుంటుంది. కానీ బ్యాంకు ఖాతాలు లేనివారికి ఈ సేవ అందుబాటులో లేదు. ఇప్పుడు వారికి కూడా యూపీఐని అందుబాటులో తెచ్చేందుకు కొత్త ఫీచర్లు వస్తున్నాయి.

డెలిగేటెడ్ చెల్లింపు అంటే..

డెలిగేటెడ్ పేమెంట్ సిస్టమ్ అనేది ఒక ప్రతిపాదిత ఫీచర్. కుటుంబ సభ్యులకు బ్యాంకు ఖాతా లేకపోయినా ఒక యూపీఐ ఖాతాను ఆ సేవలు పొందే వీలుంటుంది. ఉదాహరణకు, ఒక కుటుంబ సభ్యు డికి యూపీఐ సేవ యాక్టివేట్ చేసిన బ్యాంక్ ఖాతా ఉంది. మిగిలిన కుటుంబ సభ్యులు తమ ఫోన్లను అదే యూపీఐ ఖాతాకు లింక్ చేసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం పొదుపు ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. క్రెడిట్ కార్డ్‌లు, ఇతర క్రెడిట్ లైన్లను వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. ప్రాథమిక ఖాతాదారుడికి మాస్టర్ యాక్సెస్ ఉంటుంది, అలాగే చెల్లింపు అనుమతులను ఇతరులకు అప్పగించే వీలు కూడా లభిస్తుంది.

పనిచేసే విధానం..

ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత యూపీఐ వినియోగదారులకు తమ సేవింగ్స్ ఖాతాలను ఇతరులు ఉపయోగించేలా సెటప్ చేయాలని ఎన్పీసీఐ కోరుతుంది. అవసరమైన వినియోగదారులు దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలి. డెలిగేటెడ్ సిస్టమ్ యాక్టివేట్ అయిన తర్వాత ఎక్కువ మంది వినియోగదారులు ఒకే యూపీఐ ఖాతాను ఉపయోగించి చెల్లింపులు చేయగలుగుతారు. అయితే ఎన్పీసీఐ అధికారికంగా లిగేటెడ్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించలేదు. కానీ ఈ విధానం వల్ల యూపీఐ వినియోగం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..