Gold ETF: ఆ గోల్డ్ స్కీమ్‌లో పెట్టుబడితో రాబడికి హామీ.. ప్రయోజనాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు
ఎన్నో ఏళ్లుగా భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. పేద ప్రజల ఇళ్ల దగ్గర నుంచి ప్రతి ఇంట్లో బంగారం ఉంటుంది. ముఖ్యంగా భారతీయులు బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అందువల్ల పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే భారతదేశంలో బంగారం ఎక్కువ మొత్తం దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ దిగుమతి బంగారాన్ని తగ్గించడంతో పాటు బంగారంపై పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వివిధ పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
ఎన్నో ఏళ్లుగా భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. పేద ప్రజల ఇళ్ల దగ్గర నుంచి ప్రతి ఇంట్లో బంగారం ఉంటుంది. ముఖ్యంగా భారతీయులు బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అందువల్ల పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే భారతదేశంలో బంగారం ఎక్కువ మొత్తం దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ దిగుమతి బంగారాన్ని తగ్గించడంతో పాటు బంగారంపై పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వివిధ పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల్లో పెట్టుబడితో రాబడికి హామీ ఉండడంతో ఇవి అధిక ప్రజాదరణను పొందాయి. ఇలాంటి పథకాల్లో ఒకటైన గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటటీఎఫ్‌లు)లో పెట్టుబడులు జూలై 2024లో రూ. 1,337.4 కోట్లకు పెరిగాయి. ఇది ఫిబ్రవరి 2020 నుంచి అత్యధికం. ఏప్రిల్‌లో రూ. 395.7 కోట్ల అవుట్‌ఫ్లో తర్వాత మే-జూలై మధ్య రూ. 2,890.9 కోట్ల ఇన్‌ఫ్లోలను గోల్డ్ ఈటీఎఫ్‌లు చూశాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఈక్విటీ మార్కెట్లు అధిక వాల్యుయేషన్స్‌తో ట్రేడింగ్ చేయడంతో చాలా మంది పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరచడానికి బంగారం వైపు మొగ్గు చూపారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సావరిన్ గోల్డ్ బాండ్ల లభ్యత తగ్గినందున గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షణీయమైన ఎంపికగా మారాయని చెబుతున్నారు. ఎస్‌జీబీలు బంగారం ధరకు గణనీయమైన ప్రీమియంతో వర్తకం చేస్తున్నా 10-15 శాతం ప్రీమియం పెట్టుబడిదారులను గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల వెల్లడించి బడ్జెట్‌లో బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకం తగ్గింపును ప్రవేశపెట్టారు. అందువల్ల భారతదేశంలో బంగారం ధరలు సుమారు 9 శాతం తగ్గాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడికి ముందుకు వస్తున్నారని, వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు మంచి ప్రత్యామ్నాయంగా మారాయని చెబుతున్నారు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ అనిశ్చితి, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల పెట్టుబడిదారులు డాలర్లపై కాకుండా బంగారంపై పెట్టుబడిని ఇష్టపడుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు పెట్టుబడిదారులను టోకు ధరల వద్ద చిన్న మొత్తాలను కొనుగోలు చేయడానికి అనుమతించడం ద్వారా ధర సామర్థ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు . ప్రామాణిక ధరల కొరత కారణంగా చిన్న డినామినేషన్లు తరచుగా అధిక ధరలతో వచ్చే బంగారం వంటి మార్కెట్‌లో ఇది చాలా విలువైనదిగా ఉంటుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు స్వచ్ఛత ఆందోళనలను తొలగిస్తాయి. అలాగే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడితో మంచి లిక్విడిటీ వస్తుందని వివరిస్తున్నారు. కొనుగోలు చేసిన తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌లు పెట్టుబడిదారుడి డీమ్యాట్ ఖాతాలో ఉంటాయి. అలాగే ఇటీవల బడ్జెట్‌లో పన్ను మార్పులు పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు మళ్లేలా చేస్తాయని మార్కెట్ నిపుణులు వివరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..