Ola Roadster: ఓలా కొత్త ఈ-బైక్ స్టన్నింగ్ లుక్ చూశారా? ఏకంగా 579కి.మీల రేంజ్..
రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో అనే మూడు వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిల్లో ప్రారంభ వేరియంట్ రోడ్‌స్టర్ ఎక్స్ ధర రూ. 74,999(ఎక్స్ షోరూం) నుంచి రూ. 99,999(ఎక్స్ షోరూం) మధ్య ఉంటుంది. కాగా కాగా హై ఎండ్ వేరియంట్ రోడ్‌స్టర్ ప్రో రూ. 2 లక్షల(ఎక్స్ షోరూం) నుంచి రూ. 2.50లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహన శ్రేణికి సంబంధించి ఓలా బ్రాండ్ కు మంచి పేరుంది. అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయ హంగులతో ఈ-స్కూటర్లను ఈ కంపెనీ పరిచయం చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా కంపెనీవే. ఇప్పుడు ఓలా స్కూటర్ల నుంచి బైక్ లపై తన ఫోకస్ ను మళ్లించింది. ఈ మేరకు మూడు మోటార్ సైకిళ్లను ఒకేసారి లాంచ్ చేసింది. ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రేంజ్ పేరిట వాటిని పరిచయం చేసింది. రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో అనే మూడు వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిల్లో ప్రారంభ వేరియంట్ రోడ్‌స్టర్ ఎక్స్ ధర రూ. 74,999(ఎక్స్ షోరూం) నుంచి రూ. 99,999(ఎక్స్ షోరూం) మధ్య ఉంటుంది. కాగా కాగా హై ఎండ్ వేరియంట్ రోడ్‌స్టర్ ప్రో రూ. 2 లక్షల(ఎక్స్ షోరూం) నుంచి రూ. 2.50లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రోడ్‌స్టర్ ఎక్స్ స్పెసిఫికేషన్లు..
రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ మూడు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 2.5కేడబ్ల్యూహెచ్, 3.5కేడబ్ల్యూహెచ్, 4.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. రోడ్‌స్టర్ కూడా 3.5కేడబ్ల్యూహెచ్, 4.5కేడబ్ల్యూహెచ్, 6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. అయితే రోడ్‌స్టర్ ప్రో 8కేడబ్ల్యూహెచ్,16కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభిస్తుంది. కాగా ఈ బైక్ లన్నింటికీ ప్రీ బుకింగ్ లను ఓలా ప్రారంభించింది. రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ మోడళ్ల డెలివరీలు ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో ప్రారంభమవుతాయి. అదే సమయంలో రోడ్‌స్టర్ ప్రో డెలివరీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో ప్రారంభమవుతాయి.
ఎనిమదేళ్ల వారంటీ..
ఓలా ఎస్1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోతో సమానంగా, బ్యాటరీ వారంటీని మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియో మొత్తానికి ఎనిమిదేళ్ల పాటు అందిస్తుంది. అంతేకాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ నాటికి కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలలో దాని సొంత బ్యాటరీలను ఏకీకృతం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రస్తుతం ఓలా గిగాఫ్యాక్టరీలో ట్రయల్ ప్రొడక్షన్‌లో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ భవిష్యత్ వాహనాలన్నీ దాని జెన్-3 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. ఓలా ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో తన కొత్త మూవ్ఓఎస్ 5 బీటా వెర్షన్‌ను కూడా పరిచయం చేయనుంది.
రేంజ్ ఇది..
రోడ్‌స్టర్ ఎక్స్ 11కేడబ్ల్యూ పీక్ పవర్ అవుట్‌పుట్, రోడ్‌స్టర్ 13కేడబ్ల్యూ పీక్ పవర్ అవుట్‌పుట్, రోడ్‌స్టర్ ప్రో 52కేడబ్ల్యూ పీక్ పవర్, 105ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాప్-ఎండ్ రోడ్‌స్టర్ ఎక్స్ వేరియంట్ 200కిమీ పరిధిని కలిగి ఉంటుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. రోడ్‌స్టర్ క్లెయిమ్ చేసిన పరిధి 248కిమీ. రోడ్‌స్టర్ ప్రో టాప్ వేరియంట్ 579కిమీల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..