Hero Bike Rate Hike: హీరో బైక్, స్కూటర్ ప్రియులకు షాక్.. ఆ రెండు మోడల్స్ ధర పెంపు..?

భారతదేశంలో ఏళ్లుగా హీరో-హోండా బైక్స్ ఆటోమొబైల్ రంగాన్ని శాసించాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా హీరో, హోండా కంపెనీలు రెండు వేరుపడి రెండు వేరువేరు కంపెనీలుగా మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కొన్ని మోడల్స్ ధరలు పెంచుతున్నట్లు హీరో మోటో కార్ప్ కంపెనీ ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలపై కంపెనీ ధరల పెంపును ప్రకటించింది.

Hero Bike Rate Hike: హీరో బైక్, స్కూటర్ ప్రియులకు షాక్.. ఆ రెండు మోడల్స్ ధర పెంపు..?
Hero Bikes
Follow us

|

Updated on: Jul 02, 2024 | 8:00 PM

ఇటీవల కాలంలో భారతదేశంలో బైక్స్ స్కూటర్స్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. తగ్గుతున్న ప్రజా రవాణ నేపథ్యంలో ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు బైక్స్ లేదా స్కూటర్లు ఉంటున్నాయంటే వీటి వినియోగం ఎలా ఉందో? మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఏళ్లుగా హీరో-హోండా బైక్స్ ఆటోమొబైల్ రంగాన్ని శాసించాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా హీరో, హోండా కంపెనీలు రెండు వేరుపడి రెండు వేరువేరు కంపెనీలుగా మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కొన్ని మోడల్స్ ధరలు పెంచుతున్నట్లు హీరో మోటో కార్ప్ కంపెనీ ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలపై కంపెనీ ధరల పెంపును ప్రకటించింది. ఇది జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హీరో బైక్స్, స్కూటర్ల ధరల పెంపు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

హీరో మోటో కార్ప్ కంపెనీ ప్రకారం ధరల సవరణ రూ. 1,500 వరకు ఉంటుంది. అయితే ఈ పెంపు మోడల్, మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. హీరో మోటోకార్ప్, స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో అధిక ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్‌సెట్ చేయడానికి సర్దుబాటు అవసరమని పేర్కొంది. అందుకు అనుగుణంగా ఈ ధరల పెంపును ప్రకటించారు. హీరో మోటోకార్ప్ కంపెనీ ఇటీవలే దాని అతిపెద్ద మోటార్‌సైకిల్ మావ్రిక్ 440తో అత్యంత పోటీతత్వ, మధ్య-సామర్థ్య విభాగంలోకి ప్రవేశించింది . అంతే కాకుండా ఈ కంపెనీ తన పాపులర్ స్కూటర్ డెస్టినీ 125కు సంబంధించిన అప్‌డేట్ వెర్షన్‌ను రాబోయే నెలల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది .

హీరో మోటోకార్ప్ కంపెనీ మే 2024లో మొత్తం అమ్మకాలలో 4.11 శాతం క్షీణతను నివేదించింది. మే 2023లో 5,19,474తో పోలిస్తే 4,98,123 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దేశీయ విక్రయాల విషయానికి వస్తే అంతకుముందు సంవత్సరం 5,08,309 నుంచి 7 శాతం తగ్గి 4,79,450 యూనిట్లకు పడిపోయాయి. అయితే ఎగుమతులు మాత్రం గణనీయంగా 67.25 శాతం మేర పెరిగాయి. మే 2023లో 11,165తో పోలిస్తే 18,673 యూనిట్లకు చేరాయి. వీటిలో స్ప్లెండర్ శ్రేణి గత నెలలో 3,04,663 యూనిట్లను విక్రయించి కంపెనీకి అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..