AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group Stocks Crash: అదానీ కంపెనీ షేర్లు మరోసారి ఢమాల్.. రెడ్ జోన్‌లో కొనసాగుతున్న ట్రేడ్లు..

స్టాక్ మార్కెట్‌కు బ్యాడ్ ట్రేడ్ కనిపిస్తుంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 60,000 దిగువకు పడిపోయింది. ఇందులో బిలియనీర్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు..

Adani Group Stocks Crash: అదానీ కంపెనీ షేర్లు మరోసారి ఢమాల్.. రెడ్ జోన్‌లో కొనసాగుతున్న ట్రేడ్లు..
Adani Group Stocks Crash
Sanjay Kasula
|

Updated on: Jan 27, 2023 | 10:46 AM

Share

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక పెను సంచలనానికి దారితీస్తోంది. బిలియనీర్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు రెడ్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా రెండవ ట్రేడింగ్ సెషన్‌లో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. శుక్రవారం ఉదయం అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్‌లు భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ స్టాక్స్ 19 శాతం పడిపోయాయి. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ షేర్లను తగ్గించిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వరుసగా రెండో రోజు కూడా అదానీ కంపెనీ షేర్లు దిగువకు జారీ పోతున్నాయి. షేర్ల 85 శాతం ఓవర్‌వాల్యుయేషన్ నుంచి కార్పొరేట్ గవర్నెన్స్ వరకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

19 శాతం పడిపోయిన స్టాక్స్ ..

అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్ ప్రారంభమైన వెంటనే 19 శాతం పడిపోయింది. ఈ షేరు బుధవారం రూ.2517 వద్ద ముగిసింది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత ఒక్కో షేరు రూ.482కి పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు 13.22 శాతం పతనంతో రూ.2177 వద్ద ట్రేడవుతోంది. అదానీ టోటల్ గ్యాస్ స్టాక్‌లో కూడా భారీ క్షీణత ఉంది. ఈ షేరు చివరి ముగింపు రూ.3660 నుంచి రూ.700 దగ్గర అంటే 19 శాతం రూ.2963కి పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు 13.66 శాతం పతనంతో రూ.3147 వద్ద ట్రేడవుతోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ మునుపటి ముగింపు స్థాయి రూ. 1857 నుంచి రూ. 15.77 శాతం క్షీణించి రూ. 293కి పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు 7.74 శాతం పతనంతో రూ.1714 వద్ద ట్రేడవుతోంది.

ఈ స్టాక్‌లలో లోయర్ సర్క్యూట్

అదానీ గ్రూప్‌లోని ఇతర స్టాక్‌లలో అదానీ పవర్, అదానీ విల్మార్ కూడా 5 శాతం క్షీణించాయి. రెండు స్టాక్‌లు లోయర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. బుధవారం రూ.713 వద్ద ముగిసిన అదానీ పోర్ట్స్ స్టాక్ ప్రారంభమైన వెంటనే రూ.675కి పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు 2.63 శాతం క్షీణించి రూ.695 వద్ద ట్రేడవుతోంది.

FPO రోజున భారీ పతనం 

శుక్రవారం మార్కెట్లు తెరుకున్న వెంటనే అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో-ఆన్ ఆఫర్ కొనసాగుతోంది. ఆ వెంటనే భారీ పతనం చవి చూడాల్సి వచ్చింది. చివరి ముగింపు స్థాయి రూ.3388 నుంచి షేరు 6.13 శాతం పతనమై రూ.3180 స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ షేరు 2.25 శాతం పతనంతో రూ.3312 వద్ద ట్రేడవుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర ఇప్పుడు FPO ప్రైస్ బ్యాండ్ స్థాయికి సమీపంలో ట్రేడవుతోంది.

హిండెన్‌బర్గ్ నివేదికతో..

హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై చట్టపరమైన చర్యల ఎంపికలను అమెరికన్ కంపెనీ పరిశీలిస్తోందని అదానీ గ్రూప్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్ ‘స్టాక్ మానిప్యులేషన్ అకౌంటింగ్ మోసానికి’ పాల్పడిందని బహిరంగంగా ఆరోపించింది. హిండెన్‌బర్గ్ ప్రకారం అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ సుమారు 120 బిలియన్లు డాలర్లని తెలుస్తోంది. పైగా గడచిన మూడేళ్ల కాలంలో కుబేరుడి సంపద ఏకంగా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని నివేదిక తెలిపింది. ప్రధానంగా గ్రూప్ లోని లిస్టెడ్ కంపెనీ షేర్ ధరలు పెరుగుదల అదానీ సంపదను పెంచింది. కంపెనీల షేర్లు సగటున 819 శాతం లాభపడ్డాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం