Stock Market: స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్‌ మార్కెట్లు.. రాణిస్తున్న బ్యాంక్‌, ఐటీ స్టాక్స్‌..

SGX నిఫ్టీలో ట్రెండ్స్ సూచించిన విధంగా భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. FED తాజా ద్రవ్య విధాన సమావేశం తర్వాత US మార్కెట్లు నిన్న లాభాలతో ముగిశాయి...

Stock Market: స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్‌ మార్కెట్లు.. రాణిస్తున్న బ్యాంక్‌, ఐటీ స్టాక్స్‌..
stock market
Follow us

|

Updated on: May 26, 2022 | 9:34 AM

భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు గురువారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. FED తాజా ద్రవ్య విధాన సమావేశం తర్వాత US మార్కెట్లు నిన్న లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు కూడా నిన్న గ్రీన్‌లో ముగిశాయి. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చమురు సరఫరా గట్టిపడుతుందన్న సంకేతాలతో చమురు ధరలు భారీగా ట్రేడవుతున్నాయి. ఉదయం 9.15 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్‌ 248 పాయింట్లు లాభపడి 54008 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 16095 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 0.43, స్మాల్‌ క్యాప్‌ 0.30 శాతం పెరిగింది.

నిఫ్టీలో హిందాల్కో, టాటా స్టీల్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్ ప్రధాన లాభాల్లో ఉన్నాయి. అయితే అపోలో హాస్పిటల్స్, ఐటిసి, శ్రీ సిమెంట్స్, బిపిసిఎల్ మరియు డివ్స్ ల్యాబ్స్ నష్టపోయాయి. సబ్-ఇండెక్స్‌లు నిఫ్టీ బ్యాంక్ 0.95, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.90, నిఫ్టీ ఐటీ 0.87 శాతం పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ 1.35 శాతం పెరిగి రూ. 2,267.70 వద్ద కొనసాగుతోంది. 30-షేర్ బీఎస్‌ఈ ఇండెక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ (హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్), విప్రో, టెక్ మహీంద్రా, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, NTPC, హిందుస్థాన్ యూనిలీవర్, మారుతీ, ITC మరియు M&M నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి