Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apollo Hospitals Q4 Results: అపోలో హాస్పిటల్స్ షేర్లు ఉన్నోళ్లకు శుభవార్త.. రూ.11.75 డివిడెండ్‌ ప్రకటించిన కంపెనీ..

గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌(Apollo Hospitals) ఎంటర్‌ప్రైజెస్‌ రూ.90 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.168 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం తక్కువ...

Apollo Hospitals Q4 Results: అపోలో హాస్పిటల్స్ షేర్లు ఉన్నోళ్లకు శుభవార్త.. రూ.11.75 డివిడెండ్‌ ప్రకటించిన కంపెనీ..
Apollo
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 26, 2022 | 8:57 AM

గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌(Apollo Hospitals) ఎంటర్‌ప్రైజెస్‌ రూ.90 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.168 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం తక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.2,868 కోట్ల నుంచి 24 శాతం పెరిగి రూ.3,546.40 కోట్లకు చేరింది. మూలధన లాభాల పన్ను కోసం రూ.88.2 కోట్లను కేటాయించడంతో లాభం తగ్గింది. అపోలో ఫార్మసీ(Pharmacy) డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరించి, గ్రూప్‌ డిజిటల్‌ హెల్త్‌కేర్‌(healthcare service) సర్వీసెస్‌ ప్లాట్‌ఫామ్‌ అపోలో 24/7తో పాటు అపోలో హెల్త్‌ కంపెనీ లిమిటెడ్‌కు 100 శాతం అనుబంధ సంస్థగా మార్చారు. అపోలో హెల్త్‌ కంపెనీ ప్రస్తుతం గ్రూప్‌ ఓమ్నిఛానెల్‌ డిజిటల్‌ హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌గా పని చేయనుంది. ప్రాథమిక చికిత్స, డయాగ్నోస్టిక్స్‌, ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్‌, కండిషన్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను అందించడం ద్వారా వచ్చే మూడేళ్లలో 300 కోట్ల డాలర్లకు పైగా స్థూల వ్యాపార విలువను (GMV) సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం రూ.1,056 కోట్లకు చేరింది. 2020-21లో ఇది రూ.150 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.10,560 కోట్ల నుంచి రూ.14,663 కోట్లకు పెరిగింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.11.75 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది. అపోలో హెల్త్‌కో ఇప్పుడు గ్రూప్ ఓమ్నిచానెల్ డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రైమరీ కేర్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, కండిషన్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో నిరంతర సంరక్షణను అందిస్తుంది. రాబోయే 3 సంవత్సరాలలో GMVలో $3 బిలియన్లకు పైగా సాధించాలనే లక్ష్యంతో కంపెనీ పేర్కొంది.