లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసాయి. త్వరలోనే వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ సంకేతాలివ్వడం అంతర్జాతీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఆ సంకేతాలను దేశీయ మార్కెట్లు కూడా అందిపుచ్చుకున్నాయి. దీనికి తోడు బ్యాంకింగ్, లోహ రంగాల షేర్లు కూడా రాణించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చించింది. ఫలితంగా సూచీలు లాభాల్లో ముగిశాయి. 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మార్కెట్ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. చివరకు 266 పాయింట్లు ఎగబాకి 38,823 వద్ద […]
దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసాయి. త్వరలోనే వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ సంకేతాలివ్వడం అంతర్జాతీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఆ సంకేతాలను దేశీయ మార్కెట్లు కూడా అందిపుచ్చుకున్నాయి. దీనికి తోడు బ్యాంకింగ్, లోహ రంగాల షేర్లు కూడా రాణించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చించింది. ఫలితంగా సూచీలు లాభాల్లో ముగిశాయి. 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మార్కెట్ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. చివరకు 266 పాయింట్లు ఎగబాకి 38,823 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 84 పాయింట్లు లాభపడి 11,583 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.43గా కొనసాగుతోంది.
దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను సాధించాయి. ఎన్‌ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరోమోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటామోటార్స్ షేర్లు రాణించగా.. టెక్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, యూపీఎల్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.