Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. రాణిస్తున్న కాటన్ స్టాక్స్..
ఆసియా మార్కెట్ల ప్రతికూలతలతో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల పెట్టుబడిదారులను ఆందోళన కలిగిస్తుంది....
ఆసియా మార్కెట్ల ప్రతికూలతలతో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల పెట్టుబడిదారులను ఆందోళన కలిగిస్తుంది. ఉదయం 9:24 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 103 పాయింట్లు తగ్గి 55,271 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 39 పాయింట్లు తగ్గి 16,486 వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్వల్పంగా రాణిస్తున్నాయి.
నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1.17, నిఫ్టీ ఆటో 0.76 శాతం పడిపోయాయి. నిఫ్టీ టాప్ లూసర్‌గా హీరో మోటోకార్ప్ నిలించింది. ఈ స్టాక్ 3.27 శాతం తగ్గి రూ. 2,667.35 వద్ద ట్రేడవుతోంది. ఓఎన్‌జీసీ, అపోలో హస్పిటల్స్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా కన్సూమర్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ-30 ఇండెక్స్‌లో పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, డా. రెడ్డీస్, టాటా స్టీల్, ఎసియన్ పెయింట్స్, సన్ ఫార్మా లాభాల్లో ట్రేడవుతున్నాయి.