SBI Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు శుభవార్త చెప్పిన SBI.. రుణాలపై కూడా వడ్డీ పెంపు..

దేశంలో అతిపెద్ద పెద్ద బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిపాజిట్, రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచిన తర్వాత బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది...

SBI Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు శుభవార్త చెప్పిన SBI.. రుణాలపై కూడా వడ్డీ పెంపు..
Sbi Sco Posts
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 15, 2022 | 7:19 AM

దేశంలో అతిపెద్ద పెద్ద బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిపాజిట్, రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచిన తర్వాత బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. రుణం, డిపాజిట్ రేట్లు రెండింటిలోనూ 0.2 శాతం పెరిగినట్లు స్టేట్ బ్యాంక్ మంగళవారం తెలిపింది. గత వారంలోనే రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను 0.5 శాతం పెంచింది, ఆ తర్వాత రెపో రేట్లు 4.9 శాతానికి పెరిగాయి. దీంతో బ్యాంకులు రుణ రేట్లను పెంచుతున్నాయి. ఎంపిక చేసిన కాలపరిమితి కలిగిన రూ.2 కోట్ల కంటే తక్కువ దేశీయ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.20 శాతం పెంచినట్లు ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, రిటైల్ దేశీయ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (రూ. 2 కోట్ల కంటే తక్కువ) సవరించిన వడ్డీ రేట్లు జూన్ 14, 2022 నుండి వర్తిస్తాయి. 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిలో, బ్యాంక్ మునుపటి 4.40 శాతం నుండి 4.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు ఇంతకుముందు 4.90 శాతం ఉన్న వడ్డీ ఇప్పుడు 5.10 శాతం ఇవ్వనున్నారు. అదేవిధంగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు దేశీయ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వినియోగదారులు 5.30 శాతం వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం వడ్డీ ఉంటుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో, SBI వడ్డీ రేటును 5.20 శాతం నుండి 5.35 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లు 5.75 శాతం నుండి 5.85 శాతం సంపాదించవచ్చు. దీనితో పాటు, స్టేట్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లోన్ రేట్లను 0.2 శాతం పెంచింది. కొత్త రేట్లు జూన్ 15, 2022 నుంచి వర్తిస్తాయి. బ్యాంక్ ప్రకారం, ఒక సంవత్సరం బెంచ్మార్క్ MCLR 7.2 శాతం నుండి 7.4 శాతానికి పెరిగింది. వాహన, గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు వంటి చాలా వినియోగదారు రుణాలు MCLRతో అనుసంధానించారు.