SBI ఖాతాదారులకు షాక్… అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!
మీకు దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉందా? అయితే బ్యాంక్ మీకు షాకివ్వబోతోంది. 2019 అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారుస్తోంది. బ్యాంక్ చార్జీలు, ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇవి మనీ విత్‌డ్రా, చెక్ బుక్ వినియోగం, మనీ డిపాజిట్, సర్వీస్ చార్జీలు, ఏటీఎం లావాదేవీలు ఇలా పలు వాటికి సంబంధించినవి. వివరాల్లోకెళితే… స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడు సార్లు […]

మీకు దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉందా? అయితే బ్యాంక్ మీకు షాకివ్వబోతోంది. 2019 అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారుస్తోంది. బ్యాంక్ చార్జీలు, ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇవి మనీ విత్‌డ్రా, చెక్ బుక్ వినియోగం, మనీ డిపాజిట్, సర్వీస్ చార్జీలు, ఏటీఎం లావాదేవీలు ఇలా పలు వాటికి సంబంధించినవి. వివరాల్లోకెళితే…
- స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడు సార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేయగలరు. ఈ పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు రూ.50 చెల్లించాల్సి రావొచ్చు. దీనికి జీఎస్‌టీ అదనం. ఐదో డిపాజిట్ తర్వాత నుంచి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి రూ.56 వసూలు చేస్తుంది.
- చెక్ బుక్ విషయానికి వస్తే చెక్ బౌన్స్ అయితే అదనంగా రూ.150 చెల్లించాల్సి రావొచ్చు.
- అలాగే ఏటీఎం లావాదేవీల సంఖ్య మెట్రో నగరాల్లో 10కు పెరగనున్నాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఇది వర్తిస్తుంది.
- ఇకపోతే నాన్ మోట్రో ప్రాంతాల్లో ఎలాంటి చార్జీలు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎంలో 12 లావాదేవాలు నిర్వహించొచ్చు. అదే ఇత బ్యాంకుల ఏటీఎం అయితే 5 లావాదేవీలు మాత్రమే ఉచితం.
- ఉద్యోగులకు బంపరాఫర్ అందుబాటులోకి రానుంది. బ్యాంక్ వద్ద శాలరీ అకౌంట్ కలిగిన వారు ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
- ఇకపోతే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఉచితం. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తేనే ఈ ఫెసిలిటీ ఉంది. అదే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఈ సేవలు పొందాలంటే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు.
- ఆటో, హోమ్ లోన్స్ సహా రిటైల్ లోన్స్ అన్నీ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లతో అనుసంధానం కానున్నాయి. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ పని చేస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి రూల్ అమలులోకి వస్తుంది.