ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్… తక్కువ వడ్డీపై గృహ, వాహన రుణాలు

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా పండుగ సీజన్‌ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గృహ .. వాహన రుణాలు, ప్రాసెసింగ్‌ ఫీజులు మాఫీ, ప్రీ–అప్రూవ్డ్‌ డిజిటల్‌ రుణాలు మొదలైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘అత్యంత తక్కువగా 8.70 శాతం వడ్డీ రేటు నుంచి కారు రుణాలు అందిస్తున్నాం. పండుగ సీజన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు కూడా ఉండదు‘ అని బ్యాంకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వడ్డీ రేట్ల […]

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... తక్కువ వడ్డీపై గృహ, వాహన రుణాలు
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2019 | 6:47 AM

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా పండుగ సీజన్‌ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గృహ .. వాహన రుణాలు, ప్రాసెసింగ్‌ ఫీజులు మాఫీ, ప్రీ–అప్రూవ్డ్‌ డిజిటల్‌ రుణాలు మొదలైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘అత్యంత తక్కువగా 8.70 శాతం వడ్డీ రేటు నుంచి కారు రుణాలు అందిస్తున్నాం. పండుగ సీజన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు కూడా ఉండదు‘ అని బ్యాంకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

అలాగే వడ్డీ రేట్ల మార్పులకు సంబంధించి ఈ రుణాలపై ప్రతికూల ప్రభావాలేమీ ఉండవని వివరించింది. యోనో వంటి సొంత డిజిటల్‌ ప్లాట్‌ఫాం నుంచి లేదా వెబ్‌సైట్‌ ద్వారా కారు లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారికి వడ్డీపై 25 బేసిస్‌ పాయింట్లు (పావు శాతం) మేర తగ్గింపు కూడా పొందవచ్చు. వేతన జీవులు కారు ఆన్‌ రోడ్‌ ధరలో 90 శాతం దాకా రుణంగా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్లు ఎప్పటిదాకా అమల్లో ఉంటాయన్నది మాత్రం ఎస్‌బీఐ వెల్లడించలేదు.

సెప్టెంబర్‌ 1 నుంచి ప్రస్తుత, కొత్త గృహ రుణాలన్నింటికి రెపో రేట్‌ ఆధారిత వడ్డీ రేట్లు వర్తింపచేయనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఎస్‌బీఐ వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. ఇటీవలే మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత వడ్డీ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా గృహ రుణాలపై వడ్డీ రేటు 35 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గింది. మరోవైపు రూ. 20 లక్షల దాకా వ్యక్తిగత రుణాల విషయంలో వడ్డీ రేటు అత్యంత తక్కువగా 10.75% నుంచి ప్రారంభమవుతుందని ఎస్‌బీఐ తెలిపింది.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!