Savings: సరైన ప్రణాళికతో పొదువు చేయండి.. మీ పిల్లల భవిష్యత్‌కు బంగారు బాట వేయండి..

జీవితంలో ఆర్థికంగా ఎందగాలంటే సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు.. సంపాదించిన డబ్బు(Money)ను పొందుపు చేయడం కూడా ముఖ్యమే. కొత్తగా పెళ్లైనప్పుడు ఇద్దరే ఉంటారు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబం పెద్దదవుతుంది...

Savings: సరైన ప్రణాళికతో పొదువు చేయండి.. మీ పిల్లల భవిష్యత్‌కు బంగారు బాట వేయండి..
Investments
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 09, 2022 | 3:39 PM

జీవితంలో ఆర్థికంగా ఎందగాలంటే సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు.. సంపాదించిన డబ్బు(Money)ను పొందుపు చేయడం కూడా ముఖ్యమే. కొత్తగా పెళ్లైనప్పుడు ఇద్దరే ఉంటారు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబం పెద్దదవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పిల్లల(childrens) చదువులు, ఆరోగ్యం(health) ఇలా ఎన్నో ఖర్చులు చేయాల్సి వస్తుంది. అందుకే ప్రణాళికతో డబ్బును ముందు నుంచే పొదుపు చేస్తే తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక ప్రణాళికలో భాగంగా.. మంచి బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్‌ను తెరవండి. ఆదా చేసిన డబ్బుతో మ్యూచువల్ ఫండ్లలో SIPలో పెట్టుబడి పెట్టండి. మీరు ఒక సంవత్సరం పాటు నెలకు రూ.10 వేల రికరింగ్ డిపాజిట్‌ను తెరిస్తే, మీరు ఒక సంవత్సరం తర్వాత సుమారుగా రూ.1 లక్షా 24 వేలు (సుమారు వడ్డీ రేటు 6%) పొందుతారు. మీరు ఒక సంవత్సరం పాటు SIPలో మంచి మ్యూచువల్ ఫండ్‌లో నెలకు 10 వేల రూపాయలు పెట్టుబడి పెడితే, మీరు సుమారు 1 లక్ష 40 వేల రూపాయలు (అంచనా రేటు పది శాతం) పొందవచ్చు.

ఆసుపత్రి ఖర్చులను అంచనా వేయండి. దాని కోసం ప్రత్యేక బడ్జెట్ ఉంచండి. మీరు ఆరోగ్య బీమా తీసుకున్నట్లయితే, ప్రసూతి ఖర్చుల కోసం సదుపాయం ఉందా లేదా అని ఖచ్చితంగా తెలుసుకోండి. బిడ్డ పుట్టడానికి ముందు, తరువాత, మీరు కొత్త బట్టలు, బొమ్మలు, ప్రామ్‌లు, డాక్టర్ ఫీజు వంటి అనేక రకాల ఖర్చులకు సిద్ధం కావాలి. మీరు పని చేసే మహిళ అయితే, మీరు పిల్లల కోసం పనిమనిషిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఖర్చులన్నింటినీ బడ్జెట్ రూపొందించుకోవడం అవసరం. మంచి భవిష్యత్తు కోసం బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి పొదుపు చేయడం ప్రారంభించండి. ముందుగా మీ ఆరోగ్య బీమాలో పిల్లల పేరును చేర్చండి. పిల్లల పేరు మీద పొదుపు బీమా పథకాన్ని ప్రారంభించండి. మీకు అమ్మాయి పుడితే, ఆమె పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.

Read Also.. Digital Banking Units: 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు.. ప్రజలకు మరింత చేరువకానున్న సేవలు..