Business Ideas: ఇంట్లో ఒక రూమ్‌లో చేసే బిజినెస్.. అతి తక్కువ పెట్టుబడితో నెలకు లక్షల్లో ఆదాయం! దెబ్బకు లైఫ్ సెట్టు!
కుంకుమ పువ్వు సాగుతో లక్షల ఆదాయం పొందడం సులువు. ఏరోపోనిక్స్ పద్ధతిలో తక్కువ స్థలంలో, తక్కువ శ్రమతో ఇంట్లోనే కుంకుమ పువ్వు ను పండించవచ్చు. కిలోకు రూ.5 లక్షల వరకు ధర పలికే ఈ 'ఎర్రబంగారం'కి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.

వందలో తొంభై మందికి లైఫ్‌లో ఒక్కసారైనా బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. చాలా మందికి ఏదో ఒక బిజినెస్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ, ఏ బిజినెస్ చేయాలి? ఎలా మొదలుపెట్టాలి? ఎంత పెట్టుబడి అవుతుంది? ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వస్తువు ఏది అనే విషయాలపై సరైన అవగాహన ఉండదు. అవన్ని స్పష్టంగా తెలిస్తే చాలా మంది ఇప్పటికిప్పుడు కూడా బిజినెస్ షురూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారి కోసమే ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కుంకుమ పువ్వు ఎక్కడ పండుతుంది అంటే వెంటనే టక్కున చెప్పే పేరు కశ్మీర్. నిజానికి ఇప్పుడు ఆ పువ్వును ఎక్కడైనా పండించొచ్చు. దీని మార్కెట్ ధర కిలోకు ఏకంగా రూ.5 లక్షల వరకు ఉంది. అదే అంతర్జాతీయ మార్కెట్‌లో ఏకంగా రూ.15 లక్షల వరకు ఉంది. పెద్దగా శ్రమ పడకుండా పెట్టుబడి పెట్టి రోజులో కొంత సమయం కేటాయించి లక్షల్లో సంపాదించే అవకాశం ఉంది కుంకుమ పువ్వు బిజినెస్‌లో. పైగా పెద్ద పెద్ద భూములు కూడా అవసరం లేదు. ఒక 400 చదరపు అడుగుల రూమ్ ఉంటే చాలు వ్యాపారం మొదలు పెట్టెయ్యొచ్చు.
కుంకుమ పువ్వుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. స్వీట్స్ తయారీలో, కాస్మెటిక్స్ తయారీలో ఇలా అనేక రకాలుగా దీన్ని వాడతారు. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది పాలల్లో వేసుకు తాగితే మంచిదని చెప్తారు. ఇలా అనేక రకాలుగా దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. ఎర్రబంగారం గా పిలిచే ఈ కుంకుమ పువ్వు కు ఉన్న డిమాండ్ తో దీని ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక మంది సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. చల్లటి వాతావరణం లో పెరిగే ఈ పంటను ఇంట్లో ఎలా సాగు చెయ్యటం అనే డౌట్ మీకు రావొచ్చు. నిజానికి వాటిని మన ఇంట్లోని ఒక రూమ్‌లోనే పండించవచ్చు. అలా పండించే విధానాన్ని ‘ఏరోపోనిక్స్’ సాగు అంటారు.
ఏంటి ఈ ‘ఏరోపోనిక్స్’
ఏరోపోనిక్స్ పద్ధతిని 1970లలో అమెరికా శాస్త్రవేత్త టెడ్ గ్రీగ్ (Dr.Ted Gericke) అనే అతను NASA కోసం రూపొందించారు. అంతరిక్షంలో (space) స్పేస్ స్టేషన్స్ లో సాగు కోసం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసారు. తరువాత ఈ సాంకేతికతను భూమిపై వ్యవసాయంలో ఉపయోగించి ఇక్కడ వ్యవసాయం మొదలుపెట్టారు. దీనికి ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ తక్కువ స్థలం, తక్కువ నీరు, పైగా మట్టి అవసరం లేనే లేదు.
ఎలా మొదలు పెట్టాలి
దీని కోసం ఒక రూమ్ కావాలి. ఆ రూమ్ చల్లాగా ఉండేందుకు AC పెట్టుకోవాలి. అలాగే ఐరన్ రాక్ లు అవసరం ఉంటుంది. ఈ రాక్ లు 6 అడుగుల ఎత్తులో ఒక్కో రాక్ లో 5 అరలు వచ్చేలా చేయించుకోండి. ఓపెన్ గా ఉండాలి. మనం ప్లాస్టిక్ తొట్టెలు పెట్టుకోవానికి అనువుగా ఉండాలి. ఇక ఒక హ్యూమిడిఫైర్ అవసరం పడుతుంది. గాలిలో తేమ శాతాన్ని కంట్రోల్ లో ఉంచడానికి ఇది అవసరం పడుతుంది. ఇంతే ఇక మెషినరీ అవసరం పెద్దగా ఏమి ఉండదు.
విత్తనాలు కశ్మీర్ డైరెక్ట్ వెళ్లి తెచ్చుకుంటే బెటర్. కిలో విత్తనాలు మీకు రూ.800 దొరుకుతాయి. వీటిని బల్బులు అంటారు. చూడటానికి మన వెల్లుల్లి పాయల్లా ఉండే ఈ విత్తనాలు ఇక్కడికి తెచ్చుకుని జూలై ఎండింగ్ లో కానీ ఆగష్టు మొదటివారంలో కానీ సాగు మొదలు పెట్టవచ్చు. 7 గ్రాముల సైజున్న విత్తనం సాగుకు బాగా పనికొస్తుంది. అందుకే మీరు విత్తనాలు తెచుకున్న తరువాత చిన్న సైజు విత్తనాలు సెపెరేట్ ట్రే లో పెట్టెయ్యండి. అవి సైజు పెరిగి నెక్స్ట్ ఇయర్ కు పనికొస్తాయి.
ఖర్చు..
చిల్లర్ కాస్ట్ మీకు 1 లక్షా 50 వేల వరకు ఉంటుంది. ఇక హ్యూమిడిఫైర్ 60 వేల రూపాయలు, రాక్ ల కోసం ఒక 1 లక్షవరకు ఖర్చు రావొచ్చు. ఇక రూమ్ లో లైటింగ్ కోసం LED Grow Lights పెట్టవలిసి ఉంటుంది. వాటికోసం ఒక 60 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. ఇక చల్లటి వాతావరణం కాపాడటానికి XLPE షీటుతో ప్రూఫింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీటర్ మీకు 75 రూపాయలకు వస్తుంది. ఇక మీకు అయ్యే ఎక్కువ ఖర్చు సీడ్ కోసమే. సీడ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మీ రూమ్ సైజును బట్టి 2 నుండి 3 లక్షల రూపాయల ఖర్చు రావొచ్చు. టోటల్ ఒక 6 లక్షలతో ఈ కుంకుమ పువ్వు సాగు చేపట్టొచ్చు.
మార్కెటింగ్
పంట చేతికొచ్చాక డైరెక్ట్ మీరు ఆన్లైన్ లో హోల్ సేల్ వ్యాపారులను సంప్రదించి అమ్ముకోవచ్చు, అలానే ఆన్లైన్ వేదికగా సొంత బ్రాండ్ పెట్టుకుని కూడా అమ్మవచ్చు. ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటికి కావాల్సిన రిజిస్ట్రేషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ మార్కెట్ లో మీకు కిలో రేట్ రూ.5 లక్షల వరకు ఉంది. తొలి సంవత్సరంలో మీకు కిలో రాకపోయినా రెండవ సంవత్సరం నుండి మీకు అవగాహనతో దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఒక చిన్న రూంలో 5 కిలోలు దిగుబడి సాధిస్తున్న రైతులున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




