Russia Ukraine crisis: భారీగా పతనమైన రూపాయి.. క్రూడ్‌ ఆయిల్ ధర పెరుగుదలే కారణమా..

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం 84 పైసలు పడిపోయి డాలర్‌కు ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ. 77.01కి పడిపోయింది...

Russia Ukraine crisis: భారీగా పతనమైన రూపాయి.. క్రూడ్‌ ఆయిల్ ధర పెరుగుదలే కారణమా..
Money
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 07, 2022 | 7:47 PM

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం 84 పైసలు పడిపోయి డాలర్‌కు ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ. 77.01కి పడిపోయింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలను తారాస్థాయికి చేరాయని వ్యాపారులు చెప్పారు. దీని కారణంగా దేశీయ ద్రవ్యోల్బణం, విస్తృత వాణిజ్య లోటు గురించి ఆందోళనలు కూడా పెరిగాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీన ధోరణి కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌కు రూపాయి 76.85 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో ఇది డాలర్‌కు 77.01కి తగ్గింది. ఇందులో గత ముగింపు ధరతో పోలిస్తే 84 పైసల క్షీణత నమోదైంది.

అంతకుముందు శుక్రవారం రూపాయి డాలర్‌కు 23 పైసలు పడిపోయి 76.17 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ 15, 2021 తర్వాత కనిష్ఠ స్థాయి. రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్‌దేవా మాట్లాడుతూ.. అమెరికా కరెన్సీతో పోలిస్తే రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ వివాదం మార్కెట్‌లో రిస్క్ పెంచిందన్నారు. డాలర్ ఇండెక్స్ ఈ సమయంలో 0.62 శాతం పెరిగి 99.27 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ 7 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు ప్రస్తుతం 125 డాలర్లకు చేరుకుంది. ఈ రోజు ట్రేడింగ్ సమయంలో ఇది 131 డాలర్లకు చేరింది.

ఈరోజు బంగారం ధర రూ.1298, వెండి రూ.1910 పెరిగింది. నేటి పెరుగుదల తర్వాత, ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం పది గ్రాములకు రూ.53,784 చేరుకుంది. నేటి పెరుగుదల తర్వాత కిలో వెండి రూ.69,067 పెరిగింది.

Read Also.. Multibagger penny stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.3 లక్షల రాబడి.. అది మూడు నెలల్లోనే..

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!