Gas Cylinder Prices: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం.. కారణం ఏమిటి..?

Gass Cylinder Prices: ప్రతినెల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను సవరిస్తూ ఉంటాయి ఆయిల్‌ కంపెనీలు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌ ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి ప్రతి నెల..

Gas Cylinder Prices: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం.. కారణం ఏమిటి..?
Follow us
Subhash Goud

|

Updated on: Mar 07, 2022 | 8:23 PM

Gas Cylinder Prices: ప్రతినెల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను సవరిస్తూ ఉంటాయి ఆయిల్‌ కంపెనీలు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌ ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి ప్రతి నెల 1వ తేదీన ధరల్లో మార్పులు ఉంటాయి.. ఇప్పుడేంటి అనుకుంటున్నారా..? అయితే గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) ధర పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. సోమవారంతో దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగవచ్చు. 14 ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 130 డాలర్లకుపైగా చేరింది. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనుండటంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.

అందుకే మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయినట్లయితే ఈరోజే బుక్‌ చేసుకోవడం బెటర్‌. ఒకవేళ ధర పెరిగినట్లయితే ఎక్కువ ధరతో బుకింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎల్‌ఫీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధఱలను అమెరికా డాలర్‌తో ఇండియన్‌ రూపాయి మారక వలువ కూడా ప్రభావితం చేస్తుంది. రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టానికి పడిపోయింది. రూపాయి పడిపోవడం కారణంగా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర మరింతగా పెరిగే అవకాశాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మార్చి 8 నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇక పెట్రోల్‌, డీజిల్‌ధరలు కూడా రూ.12లకుపైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 1న గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగిన విషయం తెలసిఇందే. కమర్షియల్‌ గ్యాస్‌ సిలండర్‌ ధర రూ.105 వరకు పెరిగింది. అలాగే 5 కిలోల గ్యాస్ సిలిండర్‌ ధర కూడా రూ.27 వరకు పెరిగింది.

ఇవి కూడా చదవండి:

Vehicle Tires: టైర్లు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి.. అసలైన కారణాలు ఏమిటో తెలిస్తే..

Babies Cry: అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత ఏడ్చినా కన్నీళ్లు ఎందుకు రావు.. దీని వెనుక ఉన్న కారణం ఇదే..!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.