Multibagger penny stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.3 లక్షల రాబడి.. అది మూడు నెలల్లోనే..

స్టాక్‌ మార్కెట్‌(Stock Market)లో లిస్టయిన కంపెనీల్లో కొన్ని మల్టీబ్యాగర్(Multibagger ) రిటర్న్స్ ఇస్తాయి. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్ భారీ ఆదాయాన్ని తెచ్చి పెడతాయి...

Multibagger penny stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.3 లక్షల రాబడి.. అది మూడు నెలల్లోనే..
Stock Market
Follow us

|

Updated on: Mar 07, 2022 | 7:21 PM

స్టాక్‌ మార్కెట్‌(Stock Market)లో లిస్టయిన కంపెనీల్లో కొన్ని మల్టీబ్యాగర్(Multibagger ) రిటర్న్స్ ఇస్తాయి. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్ భారీ ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. కానీ ఈ పెన్నీ స్టాక్‌(penny stocks)ల్లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. కానీ కంపెనీపై స్పష్టం అవగాహన ఉంటే పెట్టుబడి పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి మల్టీ బ్యాగర్‌ స్టాక్‌ల్లో ఒకటి GRM ఓవర్సీస్. ఈ రైస్ మిల్లింగ్ కంపెనీ స్టాక్ 5 సంవత్సరాలలో రూ.3 నుంచి రూ. 591.90కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 200 రేట్లు పెరిగింది.

గత ఒక నెలలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనత కారణంగా ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 17 శాతం పడిపోయింది. కానీ గత 6 నెలల్లో, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ధర దాదాపు 200 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఒక సంవత్సరంలో పెన్నీ స్టాక్ దాదాపు రూ.68 నుండి రూ.591.90 వరకు పెరిగింది. ఈ సమయంలో దాదాపు 770 శాతం పెరుగదల నమోదు చేసింది. ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. దాని విలువ ఈ రోజుకు 83,000కి చేరి ఉండేది, 6 నెలల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.3 లక్షలు అయ్యి ఉండేది. ఒక ఇన్వెస్టర్ ఒక సంవత్సరం క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది ఈరోజు రూ.8.70 లక్షలకు మారింది. అదేవిధంగా ఒక పెట్టుబడిదారుడు 6 సంవత్సరాల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ. 2 కోట్లకు చేరి ఉండేది.

“GRM ఓవర్సీస్ షేర్లు ప్రస్తుతం 200 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే తక్కువగా ట్రేడవుతున్నాయని IIFL సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా చెప్పారు. జనవరి 2022లో దాని జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.935.40కి చేరిన తర్వాత సైడ్‌వే ట్రెండ్‌కు ప్రతికూలంగా ట్రేడవుతోందన్నారు. తమ పోర్ట్‌ఫోలియోలో ఈ స్టాక్ ఉన్నవారు స్టాక్‌ని ఉంచుకోవాలని సూచించారు.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read Also.. Stock Market: బేరుమన్న స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 5.61 లక్షల కోట్ల సంపద ఆవిరి..

Latest Articles